
Supreme Court: 'పంట వ్యర్థాలు తగలబెట్టడం' సమస్యపై కఠిన చట్టాలు.. కేంద్రంపై సుప్రీం అసహనం
ఈ వార్తాకథనం ఏంటి
శీతాకాలం వచ్ఛే సరికి ఉత్తర భారతం, ముఖ్యంగా దిల్లీలో గాలి నాణ్యత క్షీణించడం సాధారణం.
ప్తి ఏడాది ఇదే పరిస్థితి చోటు చేసుకుంటుంది, కానీ చర్చలు,విమర్శలు కొద్ది రోజులపాటు మాత్రమే కొనసాగుతాయి, ఆ తర్వాత సమస్యను అంతా మర్చిపోతారు.
ఇప్పుడూ ఇదే పరిస్థితి కొనసాగుతుండగా, సుప్రీంకోర్టు కేంద్రంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
'పంట వ్యర్థాల తగలబెట్టడం' సమస్యకు సంబంధించి కఠిన చట్టాలు రూపొందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
పర్యావరణ చట్టాలను సవరించి, వాటి ప్రభావాన్ని తగ్గించడం కరెక్ట్ కాదని వ్యాఖ్యానించింది.
అలాగే, పంట వ్యర్థాలు తగలబెట్టేవారిపై కఠిన చర్యలు తీసుకోవడంపై కొత్త నిబంధనలను 10 రోజుల్లోగా ప్రకటించాలని కేంద్రాన్ని ఆదేశించింది.
వివరాలు
గాలి కాలుష్యాన్ని అరికట్టడంలో ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ విఫలం
తాజాగా, గాలి కాలుష్యాన్ని అరికట్టడంలో ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ (CAQM) విఫలమవడం సుప్రీంకోర్టు గమనించింది.
పంట వ్యర్థాల సమస్యను పరిష్కరించడానికి కనీసం ఒక్క కమిటీ కూడా ఏర్పాటు కాలేదని ఆందోళన వ్యక్తం చేసింది.
గతంలో ఇచ్చిన ఆదేశాలు గాల్లో మాటలుగానే మిగిలాయని కోర్టు వ్యాఖ్యానించింది.