Supreme Court: సీఈసీ నియామకంపై దాఖలైన పిటిషన్లు.. నేడు విచారించనున్న సుప్రీం
ఈ వార్తాకథనం ఏంటి
భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేష్ కుమార్ నియామకాన్ని ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
మంగళవారం జ్ఞానేష్ కుమార్ నియామకానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.
2023 చట్టం ప్రకారం సీఈసీ, ఈసీల నియామక విధానాన్ని ప్రశ్నిస్తూ ఇప్పటికే దాఖలైన పిటిషన్లతో కలిసి, తాజా పిటిషన్లను ఫిబ్రవరి 19న (బుధవారం) ''ప్రాధాన్యత ప్రాతిపదికన'' విచారణకు తీసుకుంటామని సుప్రీంకోర్టు వెల్లడించింది.
సీఈసీ నియామక విధానాన్ని సవాలు చేస్తూ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) సహా అనేక సంస్థలు పిటిషన్లు దాఖలు చేశాయి.
ADR తరఫున ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించనున్నారు.
వివరాలు
2023లో ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలను పాటించలేదని..
2023లో ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలను సీఈసీ నియామకంలో పాటించలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు.
ప్రధాన న్యాయమూర్తితో కూడిన కమిటీ ద్వారా సీఈసీ, ఈసీల ఎంపిక, నియామకాలు జరగాలని రాజ్యాంగ ధర్మాసనం స్పష్టంగా సూచించినప్పటికీ, తాజా నియామకంలో ఆ విధానం అనుసరించబడలేదని పిటిషన్లో పేర్కొన్నారు.
ఈ కారణంగా పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కొత్త ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేష్ కుమార్ సోమవారం నియమితులయ్యారు.
ఈ సమాచారాన్ని న్యాయ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. జ్ఞానేష్ కుమార్ పదవీకాలం జనవరి 26, 2029 వరకు కొనసాగనుంది.
రాబోయే లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ కూడా ఆయన ఆధ్వర్యంలోనే ప్రకటించే అవకాశం ఉంది. బుధవారం నుంచి సీఈసీగా జ్ఞానేష్ కుమార్ అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు.