
Karnataka: భద్రతా వైఫల్యం.. సీఎం సిద్ధరామయ్య వైపు దూసుకొచ్చిన యువకుడు
ఈ వార్తాకథనం ఏంటి
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య భద్రతలో భారీ లోపం వెలుగు చూసింది.
బెంగళూరులో ఇంటర్నేషనల్ డెమొక్రసీ డే వేడుకలకు హాజరైన సీఎం.. స్టేజ్ పై కూర్చుని ఉండగా ఊహించని ఘటన ఎదురైంది.
గుర్తు తెలియని ఓ యువకుడు సెక్యూరిటీని దాటుకుని మరీ వేదికపైకి దూసుకొచ్చాడు. అతని చేతిలో ఉన్న శాలువాని సిద్ధరామయ్యపైకి విసిరాడు.
వెంటనే అలర్ట్ అయిన సీఎం భద్రతా సిబ్బంది అతడిని పట్టుకున్నారు.
ఆ యువకుడిని భద్రతా సిబ్బంది పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అనంతరం పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Details
విచారణ చేపడుతున్న పోలీసులు
ఈ యువకుడిని మహదేవ్ నాయక్‌గా గుర్తించారు. ఆ వ్యక్తికి ఎలాంటి నేర చరిత్ర లేదని, కేవలం సీఎంని చూసేందుకు మాత్రమే ఇలా వచ్చాడని పోలీసులు చెబుతున్నారు.
కేవలం ప్రోటోకాల్ ప్రకారం అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు.
సీఎంకి శాలువా ఇచ్చేందుకు వచ్చినట్టు వివరించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపడుతున్నట్టు పోలీసులు తెలిపారు.