LOADING...
Semicon India 2025: సెమికాన్ ఇండియా 2025లో..తొలి మేడ్ ఇన్ భారత్ చిప్‌ను విడుదల చేసిన ప్రధాని..విక్రమ్ 32-బిట్ ప్రో చిప్‌ను ప్రదర్శించిన మోదీ 
విక్రమ్ 32-బిట్ ప్రో చిప్‌ను ప్రదర్శించిన మోదీ

Semicon India 2025: సెమికాన్ ఇండియా 2025లో..తొలి మేడ్ ఇన్ భారత్ చిప్‌ను విడుదల చేసిన ప్రధాని..విక్రమ్ 32-బిట్ ప్రో చిప్‌ను ప్రదర్శించిన మోదీ 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 02, 2025
12:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెప్టెంబర్ 2వ తేదీ మంగళవారం న్యూఢిల్లీలో "సెమికాన్ ఇండియా 2025" కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా, ఆయన భారతదేశంలో తయారైన మొట్టమొదటి చిప్‌సెట్‌ను అందరికీ పరిచయం చేశారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా, ప్రధాని మోడీ "విక్రమ్ 32-బిట్ ప్రో" చిప్‌ను ప్రదర్శించారు. ఈ చిప్ ఏదైనా పరికరం లేదా గాడ్జెట్‌కి.. మానవునికి బ్రెయిన్ ఎంత ముఖ్యమో అంతే ముఖ్యమైనది. ఈ చిప్ డేటా ప్రాసెసింగ్, నిల్వ, నియంత్రణ, కమ్యూనికేషన్ వంటి అనేక విధులను సమర్ధవంతంగా నిర్వహిస్తుంది.

వివరాలు 

ఇస్రో సెమీకండక్టర్ పరిశోధన ప్రయోగశాలలో విక్రమ్ చిప్‌ అభివృద్ధి

ప్రధాని మోదీ సెమికాన్ ఇండియా 2025 ప్రారంభోత్సవం సందర్భంగా, ఈ సంవత్సరం నుండి భారతదేశం తన "మేడ్ ఇన్ ఇండియా" సెమీకండక్టర్ చిప్‌సెట్‌ల వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించనున్నట్టు ప్రకటించారు. విక్రమ్ చిప్‌ను ఇస్రో సెమీకండక్టర్ పరిశోధన ప్రయోగశాలలో అభివృద్ధి చేశారు. ఇది దేశంలో పూర్తిగా "మేడ్ ఇన్ ఇండియా"గా రూపొందించిన 32-బిట్ మైక్రోప్రాసెసర్. సెమీకండక్టర్ పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాలకు చిప్‌సెట్‌లను ఎగుమతి చేయగలగడం "సెమికాన్ ఇండియా 2025" కార్యక్రమంలో ప్రధాన లక్ష్యం.

వివరాలు 

సెమీకండక్టర్ మార్కెట్ 1 ట్రిలియన్ అమెరికన్ డాలర్లు దాటుతుంది : మోదీ 

ఈ సమావేశంలో ఫ్యాబ్రికేషన్, ఆధునిక ప్యాకేజింగ్, కృత్రిమ మేధస్సు, పరిశోధన, పెట్టుబడులు వంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించబడింది. కార్యక్రమం ముగిశాక, ప్రధాని మోదీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ,, కొన్ని సంవత్సరాల్లో గ్లోబల్ సెమీకండక్టర్ మార్కెట్ 1 ట్రిలియన్ అమెరికన్ డాలర్లను దాటుతుందని చెప్పారు. ఈ భారీ మార్కెట్‌లో భారతదేశం ప్రధాన భాగంగా నిలుస్తుందనే విశేషాన్నీ ఆయన వెల్లడించారు.