Page Loader
నేడు ప్రధాని మోదీ అధ్యక్షతన ఎస్ఈఓ శిఖరాగ్ర సమావేశం; పుతిన్, జిన్‌పింగ్‌, షెహబాజ్ హాజరు 
నేడు ప్రధాని మోదీ అధ్యక్షతన ఎస్ఈఓ శిఖరాగ్ర సమావేశం; పుతిన్, జిన్‌పింగ్‌, షెహబాజ్ హాజరు

నేడు ప్రధాని మోదీ అధ్యక్షతన ఎస్ఈఓ శిఖరాగ్ర సమావేశం; పుతిన్, జిన్‌పింగ్‌, షెహబాజ్ హాజరు 

వ్రాసిన వారు Stalin
Jul 04, 2023
12:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం జరిగే షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) జరగనుంది. భారత్ ఈ కార్యక్రమాన్ని వర్చువల్‌గా నిర్వహిస్తోంది. ఎస్‌సీఓ శిఖరాగ్ర సమావేశానికి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌, రష్యా అధినేత వ్లాదిమిర్‌ పుతిన్‌‍‌తో పాటు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పాల్గొననున్నారు. జూన్ చివరలో వాగ్నర్ సైనిక బృందం తిరుగుబాటు తర్వాత పుతిన్ అంతర్జాతీయ ఈవెంట్‌లో కనిపించడం ఇదే తొలిసారి. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఒంటరిగా మిగిలిపోయిన పాక్, సరిహద్దులో తరుచూ భారత్‌పై కాలు దువ్వుతున్న చైనా ఈ సమ్మిట్‌లో పాల్గొనేందుకు ఒప్పుకోవడం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నంది. మోదీకి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్టేట్ డిన్నర్ ఇచ్చిన రెండు వారాల తర్వాత ఈ శిఖరాగ్ర సమావేశం జరుగుతోంది.

ఎస్‌సీఓ

షాంఘై సహకార సంస్థ సమ్మిట్ థీమ్ ఇదే

షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) వార్షిక సమ్మిట్ సందర్భంగా ఈ ఏడాది థీమ్ 'SECURE'గా ప్రకటించారు. S: భద్రత(Security) E: ఆర్థికాభివృద్ధి (Economic development) C: కనెక్టివిటీ (Connectivity) U: ఐక్యత (Unity) R: సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతకు గౌరవం(Respect for sovereignty and territorial integrity) E: పర్యావరణ పరిరక్షణ (Environmental protection) ఎస్‌సీఓ సభ్య దేశాలు ఆఫ్ఘనిస్థాన్, తీవ్రవాదం, ప్రాంతీయ భద్రత, వాతావరణ మార్పులు, డిజిటల్ విప్లవం, వంటి ఇతర అంశాలపై చర్చిస్తారని భావిస్తున్నారు. అలాగే చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, ఇతర నేతలతో కలిసి సంస్థ భవిష్యత్తు వృద్ధికి సంబంధించిన కోర్సును రూపొందిస్తారని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ ఒక ప్రకటనలో తెలిపారు.