Supreme Court: టెలికాం సంస్థలకు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ..
సుప్రీంకోర్టు తమ అడ్జెస్టెడ్ గ్రాస్ రెవెన్యూ (AGR) బకాయిలపై ఇచ్చిన తీర్పును పునర్విమర్శించాలంటూ టెలికాం కంపెనీలు దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం తిరస్కరించింది. వొడాఫోన్ ఐడియా, భారతి ఎయిర్ టెల్‌తో పాటు మరికొన్ని కంపెనీలు, 2019లో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలపై క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేసి, దీనిపై ఓపెన్ కోర్టులో విచారణ జరిపించాలని కోరాయి. టెలికాం శాఖ (డీవోటీ) AGR బకాయిల లెక్కలలో తప్పిదాలు ఉన్నాయని ఈ కంపెనీలు వాదిస్తున్నాయి. తమ పిటిషన్‌ను ఓపెన్ కోర్టులో విచారించాలని 2022లో ఎయిర్‌టెల్, వొడాఫోన్ కోరాయి. AGR బకాయిలను ప్రభుత్వం, టెలికాం కంపెనీలు ఆదాయ పంచుకునే విధానంలో భాగంగా చెల్లించాల్సిన లైసెన్సింగ్ ఫీజులు, స్పెక్ట్రమ్ వినియోగ ఫీజులుగా పేర్కొంటున్నాయి.
10 శాతం తగ్గిన వొడాఫోన్ ఐడియా షేర్లు
అయితే డీవోటీ మాత్రం AGR లెక్కలలో వేరే శాతం పద్ధతిని పాటించిందని కంపెనీలు చెబుతున్నాయి. 2005 నుండి AGR బకాయిలు కంపెనీలకు సమస్యగా మారాయని చెబుతున్నాయి. తాజాగా సీజేఐ డివై చంద్రచూడ్, జస్టిస్ సంజీవ్ కుమార్, జస్టిస్ బీఆర్ గవయ్‌ల ధర్మాసనం ముందు లిస్టైన ఈ క్యూరేటివ్ పిటిషన్, నేడు తిరస్కరించింది. సాధారణంగా ఇలాంటి పిటిషన్లను న్యాయమూర్తులు తమ ఛాంబర్‌లో పరిశీలిస్తారు. విచారణకు అర్హత ఉందో లేదో నిర్ణయిస్తారు. ఓపెన్ కోర్టు విచారణ ప్రత్యేక అభ్యర్థనల కారణంగా మాత్రమే అనుమతించబడుతుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఈ తీర్పు వెలువడిన తరువాత, వొడాఫోన్ ఐడియా షేర్లు 10 శాతం తగ్గాయి.