Firecracker Explosion: పూరీ జగన్నాథుని చందన్ యాత్రలో బాణాసంచా పేలుడు.. 15 మందికి తీవ్ర గాయాలు
ఒడిశాలోని పూరీలో బుధవారం రాత్రి జగన్నాథుని చందన్ యాత్ర ఉత్సవాల సందర్భంగా బాణాసంచా పేలడంతో 15 మందికి కాలిన గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో నరేంద్ర పుష్కరిణి సరోవర్ ఒడ్డున వందలాది మంది ప్రజలు పూజలు చూసేందుకు గుమిగూడారని పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొందరు భక్తులు బాణాసంచా పేలుస్తుండగా నిప్పురవ్వ పడి పేలుడు సంభవించింది. మంటలు చెలరేగుతున్న బాణాసంచా ఘటనా స్థలంలో గుమికూడి ఉన్న వారిపై పడిందని, కొందరు తమను తాము రక్షించుకునేందుకు రిజర్వాయర్‌లోకి దూకారని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను జిల్లా ఆస్పత్రికి తరలించామని, వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యుడు తెలిపారు.
ఘటనపై నవీన్ పట్నాయక్ విచారం
ఈ ఘటనపై ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి సరైన చికిత్స అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. చికిత్సకు అయ్యే ఖర్చును ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి భరిస్తానని చెప్పారు. పూరీ నరేంద్ర పూల్ దగ్గర జరిగిన ప్రమాదం గురించి వినడం బాధాకరమని సీఎం నవీన్ పట్నాయక్ ట్వీట్ చేశారు. క్షతగాత్రులకు సరైన చికిత్స అందేలా చూడాలని, ఏర్పాట్లను పర్యవేక్షించాలని చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.
నవీన్ పట్నాయక్ చేసిన ట్వీట్
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ట్వీట్
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ట్వీట్ చేస్తూ, 'పూరీ చందన్ యాత్రలో నరేంద్ర పుష్కరిణి దేవిఘాట్ వద్ద జరిగిన దురదృష్టకర ప్రమాదంలో చాలా మంది గాయపడ్డారనే వార్త విని బాధపడ్డాను. భగవంతుని ఆశీస్సులతో గాయపడిన వారు త్వరగా చికిత్స పొంది ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటున్నాను.