Page Loader
Maharastra: శివాజీ మహరాజ్‌ విగ్రహం కూలిన కేసులో కాంట్రాక్టర్‌ ఆప్టేపై లుక్‌అవుట్‌ సర్క్యులర్‌ జారీ 
శివాజీ మహరాజ్‌ విగ్రహం కూలిన కేసులో కాంట్రాక్టర్‌ ఆప్టేపై లుక్‌అవుట్‌ సర్క్యులర్‌ జారీ

Maharastra: శివాజీ మహరాజ్‌ విగ్రహం కూలిన కేసులో కాంట్రాక్టర్‌ ఆప్టేపై లుక్‌అవుట్‌ సర్క్యులర్‌ జారీ 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 04, 2024
12:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

మహారాష్ట్ర సింధుదుర్గ్‌ జిల్లా రాజ్‌కోట్‌ కోటలో మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిన ఘటన మహారాష్ట్ర రాజకీయాల్లో పెద్ద దుమారం రేపింది. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే. కానీ, ఈ తప్పిదం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అవినీతికి సంబంధించి ఉందని, దీన్ని క్షమించలేమని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. తాజాగా, ఈ ఘటనపై శివాజీ విగ్రహ కాంట్రాక్టర్‌ జైదీప్‌ ఆప్టేపై సింధుదుర్గ్‌ పోలీసులు లుక్‌అవుట్‌ నోటీసులు జారీ చేశారు. ఆయన్ని దేశం విడిచి పారిపోకుండా ఆపేందుకు అన్ని విమానాశ్రయాలకు లుక్‌అవుట్‌ నోటీసులు పంపినట్లు పోలీసులు తెలిపారు.

వివరాలు 

ఆగస్టు 26న కూలిన శివాజీ విగ్రహం

ఠాణెకు చెందిన జైదీప్‌ ఆప్టే ఆధ్వర్యంలో ఈ విగ్రహం నిర్మించబడింది. శివాజీ విగ్రహం కూలిపోయిన తరువాత ఆయన పరారీలో ఉన్నారు. రాజ్‌కోట్‌ కోటలో ఏర్పాటు చేసిన శివాజీ విగ్రహం ఆగస్టు 26న కూలింది. గతేడాది డిసెంబర్ 4న సింధుదుర్గ్‌లో 35 అడుగుల ఎత్తైన శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మరోవైపు, శివాజీ విగ్రహం కూలిన ఘటనలో శిల్పిని మాత్రమే కాకుండా ఇతరులను కూడా బాధ్యులుగా భావించాలని ప్రతిపక్ష కాంగ్రెస్‌ సీఎం ఏక్‌నాథ్‌ షిండే ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తోంది.