LOADING...
EC: నకిలీ ఓటర్లను ఎలాగా అనుమతించగలం?: కేంద్ర ఎన్నికల సంఘం  
నకిలీ ఓటర్లను ఎలాగా అనుమతించగలం?: కేంద్ర ఎన్నికల సంఘం

EC: నకిలీ ఓటర్లను ఎలాగా అనుమతించగలం?: కేంద్ర ఎన్నికల సంఘం  

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 24, 2025
11:36 am

ఈ వార్తాకథనం ఏంటి

బిహార్ రాష్ట్రంలో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియపై ప్రతిపక్షాలు తీవ్రంగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విమర్శలపై తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం స్పందిస్తూ, నకిలీ ఓటర్లకు అవకాశమిస్తామా? అనే ప్రశ్నను లేవనెత్తింది. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను సమర్థించుకుంటూ, అది నిష్పాక్షికంగా, నిబంధనల ప్రకారమే జరిగిందని తెలిపింది. ఈ నేపథ్యంలో గురువారం కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్ కుమార్ ఓ అధికారిక ప్రకటన విడుదల చేశారు. అందులో ఆయన, ఓటర్ల జాబితాలో నకిలీ పేర్లు చేరడమన్నది పూర్తిగా నిరాధారమని స్పష్టంగా పేర్కొన్నారు.