CM Siddaramaiah: కర్ణాటక సీఎం సిద్ధ రామయ్యకు భారీ ఊరట.. ముడా కుంభకోణం కేసులో లోకాయుక్త క్లీన్ చిట్
ఈ వార్తాకథనం ఏంటి
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ముడా కేసులో భారీ ఊరట లభించింది.
ఈ కేసులో ఆయనకు లోకాయుక్త పూర్తి క్లీన్‌చిట్ ఇచ్చింది. ముడా కుంభకోణానికి సంబంధించి ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టంగా ప్రకటించింది.
ముడా స్కాం ఏమిటి?
మైసూరు పట్టణాభివృద్ధి ప్రాధికార సంస్థ (ముడా) భూముల కేటాయింపు వివాదంలో, విలువైన భూములు సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతికి లభించేలా ఆయన కుట్ర పన్నారని ఆరోపణలు వచ్చాయి.
సమాచార హక్కు చట్టం కార్యకర్తలు టీజే అబ్రహాం, ఎస్పీ ప్రదీప్, స్నేహమయి కృష్ణ ఈ ఆరోపణలపై అభ్యర్థన సమర్పించారు.
ఈ నేపథ్యంలో,కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లోత్ ముఖ్యమంత్రి పై విచారణ జరిపేందుకు అనుమతి ఇవ్వడం రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద సంచలనంగా మారింది.
వివరాలు
భూమి వివాదం
సిద్ధరామయ్య భార్య పార్వతికి మైసూరులోని కేసరే గ్రామంలో 3 ఎకరాల భూమి ఉంది.
ఈ భూమిని ఆమె సోదరుడు మల్లికార్జున బహుమతిగా ఇచ్చారు. అయితే, అభివృద్ధి కోసం ముడా సంస్థ ఈ భూమిని స్వాధీనం చేసుకుంది.
పరిహారం కింద, 2021లో మైసూరులోనే ప్రధానమైన విజయనగర్ ప్రాంతంలో 38,283 చదరపు అడుగుల ప్లాట్‌ను ప్రభుత్వం పార్వతికి కేటాయించింది.
అయితే, ప్రభుత్వం ఇచ్చిన ఈ ప్లాట్ విలువ, ముడా స్వాధీనం చేసుకున్న భూమికన్నా ఎక్కువగా ఉందని బీజేపీ ఆరోపించింది. దీంతో ముడా స్కాం వివాదం మరింత తీవ్రమైంది.