Page Loader
Siddaramaiah: ముడా స్కామ్‌లో సిద్ధరామయ్యకు హైకోర్టులో ఊరట
ముడా స్కామ్‌లో సిద్ధరామయ్యకు హైకోర్టులో ఊరట

Siddaramaiah: ముడా స్కామ్‌లో సిద్ధరామయ్యకు హైకోర్టులో ఊరట

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 19, 2024
06:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రస్తుతం కర్ణాటక రాజకీయాల్లో ముడా స్కాం కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో హైకోర్టులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కు హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆ కుంభకోణానికి సంబంధించి తనను విచారించేందుకు గవర్నర్‌కు అనుమతి ఇవ్వడాన్ని సీఎం హైకోర్టులో సవాల్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో హైకోర్టు స్పందించింది. ఆయనపై ఎలాంటి తక్షణ చర్యలు తీసుకోవద్దని ట్రయల్ కోర్టును ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణ ఆగస్టు 29న జరగనుంది.

Details

ఖరీదైన భూములిచ్చారంటూ ఆరోపణలు చేసిన ప్రతిపక్షాలు

మైసూర్ ప్రాంతంలో సీఎం సిద్దరామయ్య భార్య పార్వతమ్మ పేరిట ఉన్న భూములను గతంలో అభివృద్ధి పనుల కోసం ముడా సేకరించింది. పరిహారంగా ఆమెకు మైసూర్-విజయనగరలో స్థలాలు కేటాయించిన విషయం తెలిసిందే. అయితే ఖరీదైన విలువైన స్థలాలను ఇచ్చారని ప్రతిపక్షాలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆయను విచారణకు అనుమతిస్తూ గవర్నర్ అనుమతులు ఇచ్చారు.