Karnataka: COVID-19 నిధులను బిజెపి దుర్వినియోగం చేసింది.. ఆరోపించిన సిద్ధరామయ్య ప్రభుత్వం
కర్ణాటకలో మరో కుంభకోణం కలకలం సృష్టిస్తోంది. కొవిడ్ సంక్షోభ సమయంలో భారీ మొత్తంలో అవకతవకలు జరిగాయని తాజా నివేదికలో వెల్లడైంది. ఈ నివేదికను జస్టిస్ జాన్ మైఖెల్ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది. కమిటీ కొన్ని కీలక పత్రాలు కనిపించకపోవడం గుర్తించింది. ఈ నేపథ్యంలో, సిద్ధరామయ్య ప్రభుత్వం బీజేపీ హయాంలో జరిగిన అక్రమాలపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకుంది. సీఎం సిద్ధరామయ్య ప్రభుత్వానికి ముడా స్కామ్ ఇబ్బందులు కలిగిస్తోంది. ఆయన భార్య పార్వతమ్మ పేరిట మైసూరు ప్రాంతంలో అభివృద్ధి పనుల కోసం ముడా సేకరించిన భూములను ఇటీవల వివాదంగా మారాయి. ఆమెకు పరిహారంగా మైసూరు-విజయనగర ప్రాంతాలలో విలువైన స్థలాలు కేటాయించింది.
రూ.1,000 కోట్లు నష్టం
బీజేపీ,సీఎం మౌఖిక ఆదేశాలతో మైసూరు నగరాభివృద్ధి సంస్థ (ముడా) అధికారులు ఆమెకు ఖరీదైన స్థలాలు కట్టబెట్టారని ఆరోపిస్తోంది. ఈ సమయంలో, బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప హయాంలో చోటుచేసుకున్న అవకతవకలపై తాజా నివేదిక వెలువడింది. సిద్ధరామయ్య క్యాబినెట్ సమావేశంలో ఈ నివేదికపై చర్చించగా, కమిటీ వందల కోట్లు దుర్వినియోగం, కొన్ని కీలక పత్రాలు కోల్పోయిన విషయాలను గుర్తించినట్లు పేర్కొన్నాయి. కొవిడ్ సమయంలో రాష్ట్రం ఖర్చు చేసిన మొత్తం సుమారు రూ.13 వేల కోట్లు, కానీ ఈ వివరాలను అధికారికంగా ఎక్కడా ప్రకటించలేదు. అందులో సుమారు రూ.1,000 కోట్లు నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రాథమిక నివేదికకు ఆరు నెలల్లో తుదిరూపం ఇవ్వనున్నారు.
న్యాయశాఖ మంత్రి హెచ్‌కే పాటిల్ అసహనం
ముడా స్కామ్ మోసం తరుణంలో 'కొవిడ్' కుంభకోణం నివేదిక వెలువడడం పట్ల మీడియా ప్రశ్నించినప్పుడు న్యాయశాఖ మంత్రి హెచ్‌కే పాటిల్ అసహనం వ్యక్తం చేశారు. ''ముడా వ్యవహారంపై విమర్శలు రాబట్టిన రెండు నెలలు కూడా కాలేదు. జస్టిస్ జాన్ మైఖెల్ కమిటీ ఏడాదిక్రితం ఏర్పాటుచేశారు. ఈ రెండు విషయాలను ఎలా పోలిస్తారు? ఇది దురదృష్టకరం'' అని ఆయన వ్యాఖ్యానించారు.