LOADING...
Path Finders: ఏఐతో కెరీర్‌ ఎంపిక సులభం.. సీఆర్‌రెడ్డి విద్యార్థుల వినూత్న ఆవిష్కరణ
ఏఐతో కెరీర్‌ ఎంపిక సులభం.. సీఆర్‌రెడ్డి విద్యార్థుల వినూత్న ఆవిష్కరణ

Path Finders: ఏఐతో కెరీర్‌ ఎంపిక సులభం.. సీఆర్‌రెడ్డి విద్యార్థుల వినూత్న ఆవిష్కరణ

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 25, 2026
09:02 am

ఈ వార్తాకథనం ఏంటి

విద్యార్థుల నైపుణ్యాలను సమగ్రంగా విశ్లేషించి,వారికి సరిపోయే కెరీర్‌ దిశను చూపించే 'స్మార్ట్‌ ఏఐగైడ్‌' ప్రాజెక్టు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. రాష్ట్రస్థాయి హ్యాకథాన్‌లో వినూత్న ఆవిష్కరణగా గుర్తింపు పొందిన ఈ ప్రాజెక్టు,గతేడాది డిసెంబర్‌లో రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగిన జాతీయ స్థాయి హ్యాకథాన్‌లో కూడా ప్రశంసలు దక్కించుకుంది. ఏలూరులోని సీఆర్‌రెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాల ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ విభాగంలో నాలుగో సంవత్సరం చదువుతున్నచింతా యశ్వంత్‌ సాయిరామ్‌ నేతృత్వంలోని 'పాత్‌ ఫైండర్స్‌'బృందం దీన్ని అభివృద్ధి చేసింది. విద్యార్థులు ఎంచుకున్న రంగాల్లో ఉన్న సందేహాలను నివృత్తి చేయడంతో పాటు,వారి ఆసక్తులు, నైపుణ్యాలు,లక్ష్యాలను పరిగణలోకి తీసుకుని సరైన కెరీర్‌ మార్గాలను సూచించడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. ఈ ప్రాజెక్టులో ముఖ్యంగా'కెరీర్‌ గైడెన్స్‌','రెజ్యూమె ఎనలైజర్‌','కెరీర్‌ హెల్త్‌ స్కోర్‌' వంటి ఫీచర్లు ఉన్నాయి.

వివరాలు 

ఏఐతో కెరీర్‌ మార్గదర్శనం

'కెరీర్‌ గైడెన్స్‌' విభాగంలో విద్యార్థులు తమ వ్యక్తిగత వివరాలు,విద్యా సమాచారం,ఆసక్తి ఉన్న రంగాలను నమోదు చేస్తే, కృత్రిమ మేధ ఆధారంగా వారికి సరిపోయే కెరీర్‌ అవకాశాలను సూచిస్తుంది. 'రెజ్యూమె ఎనలైజర్‌' ఫీచర్‌లో విద్యార్థులు తమ రెజ్యూమెను అప్లోడ్‌ చేస్తే, అది విశ్లేషణ చేసి బలాలు, బలహీనతలను గుర్తిస్తుంది. తరువాత రెజ్యూమెకు ఒక స్కోర్‌ను కేటాయించి, మెరుగుదలకు అవసరమైన సూచనలను అందిస్తుంది. అదనంగా, సంబంధిత నైపుణ్యాలకు అనుగుణంగా సిలబస్‌ను అందించడం మాత్రమే కాకుండా, క్విజ్‌ల రూపంలో సాధనకు అవకాశం కల్పిస్తుంది.

వివరాలు 

ఏఐతో కెరీర్‌ మార్గదర్శనం

దశలవారీగా అభ్యాసం ద్వారా విద్యార్థుల పురోగతిని 'కెరీర్‌ హెల్త్‌ స్కోర్‌' రూపంలో చూపిస్తుంది. ఇది ప్రస్తుత స్థాయి నుంచి లక్ష్య సాధన వరకు స్పష్టమైన మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది. పూర్తిగా కృత్రిమ మేధ సాయంతో రూపొందించిన ఈ ప్రాజెక్టును ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాల్లో ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఉపయోగపడేలా రూపొందించారు. త్వరలోనే దీన్ని యాప్‌ రూపంలో అందుబాటులోకి తీసుకురావడానికి బృందం ప్రయత్నిస్తోంది.

Advertisement