Smriti Irani: ఉత్తర్‌ప్రదేశ్'లో స్మృతి ఇరానీ వెనుకంజ .. ఆధిక్యంలో కిశోరీ లాల్ శర్మ
ఉత్తర్‌ప్రదేశ్'లోని అమేథి లోక్‌సభ బీజేపీ అభ్యర్థి, ప్రస్తుత కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వెనుకంజలో ఉన్నారు. దేశవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు ఉత్కంఠభరితంగా సాగుతోంది. ఈ సారి కూడా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి కేంద్రంలో మరోసారి అధికారంలోకి రాబోతోందంటూ అత్యధికంగా ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగానే ఎన్డీఏ కూటమి 290 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. ప్రతిపక్ష ఇండియా కూటమి సైతం ఎన్డీఏకి పోటీగా 212 స్థానాల్లో దూసుకెళ్తోంది. దీంతో రెండు పార్టీల మధ్య పోటాపోటీ కొనసాగుతోంది. ఇదే సమయంలో పలువురు కీలక నేతలు సైతం వెనుకంజలో ఉన్నారు.
అమేథీలో స్మ్రుతిఇరానీ వెనుకంజ
ఉత్తరప్రదేశ్‌లోని అమేథి లోక్‌సభ బీజేపీ అభ్యర్థి, ప్రస్తుత కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వెనుకంజలో ఉన్నారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ బలపర్చిన కిశోరి లాల్ శర్మ లీడింగ్‌లో కొనసాగుతున్నారు. స్మృతి ఇరానీపై ఆయన 3,018 ఓట్ల ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. ఆయనకు ఇప్పటి వరకూ 11,742 ఓట్లు రాగా, ఇరానీకి 8,724 ఓట్లు వచ్చాయి.