
Pawan Kalyan : సినిమాల కంటే దేశమే ముఖ్యం.. గ్రామసభలో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
తనకు సినిమాల కంటే దేశమే ముఖ్యమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
అన్నమయ్య జిల్లా పర్యటనలో భాగంగా మైసూరివారిపల్లిలో శుక్రవారం నిర్వహించిన గ్రామసభలో ఆయన మాట్లాడారు.
గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటుందన్నారు. సినిమాలు వేరు, రాజకీయాలు వేరు అని, తనకు సినిమాల కంటే సమాజమే ముఖ్యమన్నారు.
రాజకీయాలకు అతీతంగా అభివృద్ధే కూటమి లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. దేశ అభివృద్ధిలే గ్రామ పంచాయతీలే కీలకమని చెప్పారు.
Details
స్వర్ణ పంచాయతీల ఏర్పాటే తమ లక్ష్యం
రాష్ట్రంలో 70శాతం మంది వైసీపీకి చెందిన సర్పంచులే ఉన్నారని, అయినా పార్టీలకు అతీతంగా అభివృద్ధికి కట్టుబడి పవన్ కళ్యాణ్ ఉన్నామన్నారు.
స్వర్ణ పంచాయతీల ఏర్పాటే తమ ముందు ఉన్న లక్ష్యమని పేర్కొన్నారు.
గ్రామాల అభివృద్ధికి గ్రామ సభలు కీలకమని, గత ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి రూ.41వేల కోట్లు ఖర్చు పెట్టిందన్నారు. వాస్తవంగా 15వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారన్నారు.
గ్రామాలన్నీ బలపడితే రాష్ట్రానికి ఉన్న అప్పులు కూడా తీరుతాయన్నారు.