LOADING...
DK Shivakumar: 'కొందరు అధికారాన్ని పంచుకోవడానికి అంగీకరించరు'.. సీఎం పదవిపై డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు
సీఎం పదవిపై డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు

DK Shivakumar: 'కొందరు అధికారాన్ని పంచుకోవడానికి అంగీకరించరు'.. సీఎం పదవిపై డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 04, 2025
09:00 am

ఈ వార్తాకథనం ఏంటి

కర్ణాటక రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్, ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో ఉన్న విభేదాలను బహిరంగంగా బయటపెట్టారు. సీఎం పదవి సంబంధంగా చేసిన సంచలన వ్యాఖ్యలతో పాటు, అధికార భాగస్వామ్యం పై పరోక్షంగా సిద్ధరామయ్యను లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యానించారు. డిల్లీలో నిర్వహించిన 'రాజ్యాంగ సవాళ్లు' అనే కార్యక్రమంలో డీకే శివకుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావడానికి తన చేసిన కృషి,పార్టీ కోసం అందించిన సేవలను ఆయన గుర్తు చేశారు. అలాగే, గాంధీ కుటుంబాన్ని పొగడ్తలతో ముంచెత్తుతూ, అధికార భాగస్వామ్యం అంశంపై ముఖ్యమైన సంకేతాలను పరోక్షంగా ఇచ్చారు.

వివరాలు 

అధికారాన్ని వదులుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేరు 

2004లో సోనియా గాంధీ ప్రధానమంత్రి పదవిని త్యాగం చేసిన సందర్భాన్ని శివకుమార్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. "అధికారమే ముఖ్యం కాదు"అని భావించి,ఒక సిక్కు,అల్పసంఖ్యాకుడైన మన్మోహన్ సింగ్‌కు ప్రధాన మంత్రి స్థానం అప్పగించారని కొనియాడారు. " ఇలాంటి గొప్ప త్యాగం ప్రజాస్వామ్యంలో మరెవరి నుంచి చూశాం?ఈ రోజుల్లో ఒక చిన్న పంచాయతీ పదవిని కూడా వదులే మనస్తత్వం ఎవరికీ లేదు" అని వ్యాఖ్యానించారు. డీకే శివకుమార్ ఎక్కడా సిద్ధరామయ్య పేరును నేరుగా ప్రస్తావించకపోయినా, ఆయన వ్యాఖ్యలు సిద్ధరామయ్యకే సూచిస్తున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటీవల సిద్ధరామయ్య "ఏ అధికార భాగస్వామ్య ఒప్పందం లేని విధంగా, ఐదేళ్లూ తానే ముఖ్యమంత్రి ఉంటారు" అని ప్రకటించిన నేపథ్యంలో డీకే శివకుమార్ వ్యాఖ్యలు కొత్త రాజకీయ చర్చకు తావిచ్చాయి.