AP: రాష్ట్ర ప్రభుత్వం గౌరవ సలహాదారులుగా వివిధ రంగాల్లో నిష్ణాతులైన నలుగురు ప్రముఖులు.. రెండేళ్లపాటు బాధ్యతలు.. ప్రభుత్వం ఉత్తర్వులు
ఈ వార్తాకథనం ఏంటి
రాష్ట్ర ప్రభుత్వం నాలుగు విభిన్న రంగాల్లో నిష్ణాతులైన ప్రముఖులను గౌరవ సలహాదారులుగా నియమించింది.
స్పేస్ టెక్నాలజీ కోసం ఇస్రో మాజీ ఛైర్మన్ శ్రీధర ఫణిక్కర్ సోమనాథ్, ఏరోస్పేస్ & డిఫెన్స్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్ కోసం కేంద్ర రక్షణశాఖ సలహాదారు సతీష్ రెడ్డి, చేనేత & హస్తకళల అభివృద్ధికి పారిశ్రామికవేత్త & భారత్ బయోటెక్ సంస్థ ఎండీ సుచిత్ర ఎల్ల, ఫోరెన్సిక్ సైన్స్ రంగానికి ప్రముఖ శాస్త్రవేత్త కేపీసీ గాంధీని కేబినెట్ హోదాతో సలహాదారులుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
వీరి పదవీ కాలం రెండేళ్లపాటు ఉంటుంది.
వివరాలు
సుచిత్ర ఎల్ల: చేనేత & హస్తకళల అభివృద్ధికి కృషి
సుచిత్ర ఎల్ల భారత్ బయోటెక్ సహ వ్యవస్థాపకురాలు,ఎల్ల ఫౌండేషన్ ఎండీ.
కొవిడ్ వ్యాక్సిన్ అభివృద్ధితో పాటు బయోటెక్నాలజీలో విశేష కృషి చేసినందుకు 2022లో భర్త డాక్టర్ కృష్ణ ఎల్లతో కలిసి పద్మభూషణ్ అందుకున్నారు.
ఆమె తితిదే ధర్మకర్తల మండలి సభ్యురాలిగా వ్యవహరిస్తున్నారు.పారిశ్రామిక, సామాజిక సేవల్లో చేసిన కృషికి పలు అవార్డులు పొందారు.
సలహాదారుగా బాధ్యతలు
చేనేత & హస్తకళల అభివృద్ధికి సలహాలు అందించడం
జాతీయ & అంతర్జాతీయ ఉత్తమ విధానాలను సూచించడం
మార్కెట్ అవకాశాలను పెంచి కళాకారులకు మద్దతు అందించడం
మహిళా కళాకారులు & అట్టడుగు వర్గాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించడం
డిజిటల్ మార్కెటింగ్ & భౌగోళిక గుర్తింపు (GI) కోసం సహాయపడడం
వివరాలు
సతీష్ రెడ్డి: రక్షణ రంగ అభివృద్ధికి కీలక బాధ్యతలు
సతీష్ రెడ్డి ప్రముఖ రక్షణ రంగ శాస్త్రవేత్త. డీఆర్‌డీఓ ఛైర్మన్‌గా, డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిస్సైల్స్‌గా సేవలందించారు.
మిషన్ శక్తి, లాంగ్ రేంజ్ గైడెడ్ బాంబ్, క్షిపణి టార్పెడో వ్యవస్థల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు.
ఆయన పలు ప్రతిష్ఠాత్మక అవార్డులు అందుకున్నారు.
సలహాదారుగా బాధ్యతలు
ఏరోస్పేస్ & డిఫెన్స్ పరిశ్రమ అభివృద్ధికి మార్గదర్శకత్వం
డీప్‌టెక్, ఏఐ, రోబోటిక్స్, సైబర్ సెక్యూరిటీ లాంటి రంగాల్లో సలహాలు
పారిశ్రామికవేత్తలు, పరిశోధన సంస్థలు, రక్షణ సంస్థలతో సమన్వయం
వివరాలు
కేపీసీ గాంధీ: ఫోరెన్సిక్ సైన్స్‌లో నూతన దిశలు
కేపీసీ గాంధీ ప్రముఖ ఫోరెన్సిక్ శాస్త్రవేత్త. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఫోరెన్సిక్ ల్యాబ్ డైరెక్టర్‌గా పదవీ విరమణ చేశారు.
ఆయన ట్రూత్ ల్యాబ్స్‌ను స్థాపించి, ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.
సలహాదారుగా బాధ్యతలు
ఫోరెన్సిక్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి సూచనలు
నేరగాళ్ల ప్రొఫైలింగ్, డేటా ఇంటిగ్రేషన్‌ను ప్రోత్సహించడం
ఫోరెన్సిక్ ప్రయోగశాలల ఆధునీకరణ
విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థలతో కలిసి ఫోరెన్సిక్ విద్యను ప్రోత్సహించడం
వివరాలు
సోమనాథ్: స్పేస్ టెక్నాలజీ అభివృద్ధికి ప్రణాళికలు
ఇస్రో మాజీ ఛైర్మన్ సోమనాథ్ స్పేస్ టెక్నాలజీలో 40 ఏళ్ల అనుభవం కలిగి ఉన్నారు.
2022 నుండి 2025 వరకు ఇస్రో ఛైర్మన్‌గా సేవలందించారు. ప్రస్తుతం విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్‌లో ప్రొఫెసర్‌గా ఉన్నారు.
సలహాదారుగా బాధ్యతలు
స్పేస్ టెక్నాలజీని పరిపాలన, పరిశ్రమ, పరిశోధన రంగాల్లో వినియోగించేందుకు విధానాల రూపకల్పన
వ్యవసాయం, విపత్తు నిర్వహణ, అర్బన్ ప్లానింగ్ వంటి రంగాల్లో స్పేస్ టెక్నాలజీ వినియోగానికి మార్గదర్శకత్వం
శాటిలైట్ నావిగేషన్, ఏఐ ఆధారిత స్పేస్ అనలిటిక్స్ వినియోగాన్ని ప్రోత్సహించడం
ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం ఈ నలుగురు ప్రముఖులు తమ అనుభవాన్ని ఉపయోగించి రాష్ట్ర అభివృద్ధికి కీలక భూమిక పోషించనున్నారు.