
తెలంగాణ ప్రజలపై కాంగ్రెస్ 5 వరాలు..10 లక్షల మందితో సోనియా గాంధీ భారీ సభ
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్‌లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్న సోనియాగాంధీకి టీపీసీసీ ధన్యవాదాలు ప్రకటించింది.
తెలంగాణలో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో 5 హామీలను రాష్ట్రంలోనే ప్రకటించాలని సోనియాగాంధీని అభ్యర్థించినట్లు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు.
ఈ మేరకు సెప్టెంబర్ 17న నిర్వహించనున్న కాంగ్రెస్ భారీ బహిరంగ సభలో పార్టీ అగ్రనేత సోనియా గాంధీ 7 గ్యారెంటీలను ప్రకటిస్తారని రేవంత్ చెప్పారు.
సెప్టెంబర్ 18 నుంచి 119 నియోజకవర్గాల ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు గురువారంతో ఏడాది పూర్తవుతున్నందున మండల, జిల్లా కేంద్రాల్లో పాదయాత్రలు నిర్వహిస్తామన్నారు.
దేశం మొత్తం తెలంగాణనను చూస్తోందని, సీడబ్ల్యూసీ, బహిరంగసభను సక్సెస్ చేయాలని ఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్‌రావు ఠాక్రే కోరారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఇందిరాభవన్ లో సీడబ్ల్యూసీ మీటింగ్ గురించి మాట్లాడుతున్న మాణిక్‌రావు ఠాక్రే
AICC Incharge Of Telangana Shri Manikrao Thakare Ji addressed Extended Executive Committee meeting of TPCC at Indira Bhavan today to discuss the upcoming first CWC meeting, public meeting and Bharat Jodo Anniversary Program. pic.twitter.com/mCtCP8k6wh
— Office Of Manikrao Thakare (@OfficeOfThakare) September 5, 2023