Special Trains: దసరా,దీపావళి పండుగలకు 48 ప్రత్యేక రైళ్లు
దసరా, దీపావళి, ఛాట్ ఫెస్టివల్స్ సందర్భంగా వివిధ ప్రాంతాలకు ప్రయాణికులను తీసుకెళ్లేందుకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మంగళవారం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, 48 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపారు. ఈ రైళ్లు అక్టోబర్ 21 నుండి నవంబర్ 27 వరకు కొనసాగుతాయి. నాందేడ్ నుంచి పన్వెల్: అక్టోబర్ 21 నుండి నవంబర్ 27 వరకు ప్రతి సోమ, బుధవారాల్లో నాందేడ్ (07625) నుంచి పన్వెల్‌కు 12 ప్రత్యేక రైళ్లు. పన్వెల్ నుంచి నాందేడ్: అక్టోబర్ 22 నుండి నవంబర్ 28 వరకు ప్రతి మంగళ, గురువారాల్లో 12 ప్రత్యేక రైళ్లు (07626).
పూణె నుండి కరీంనగర్‌కు 4 ప్రత్యేక రైళ్లు
కొచువెలి-నిజాముద్దీన్: అక్టోబర్ 11 నుండి నవంబర్ 29 వరకు ప్రతి శుక్రవారం 8 ప్రత్యేక రైళ్లు (06071). నిజాముద్దీన్-కొచువెలి: అక్టోబర్ 14 నుండి డిసెంబర్ 2 వరకు ప్రతి సోమవారం 8 ప్రత్యేక రైళ్లు (06072). పూణె-కరీంనగర్: అక్టోబర్ 21 నుండి నవంబర్ 11 వరకు ప్రతి సోమవారం పూణె నుండి కరీంనగర్‌కు 4 ప్రత్యేక రైళ్లు (01451). కరీంనగర్-పూణె: అక్టోబర్ 23 నుండి నవంబర్ 13 వరకు ప్రతి బుధవారం 4 ప్రత్యేక రైళ్లు (01452).