Page Loader
AP Rains: ఏపీలో నైరుతి ప్రభావం.. ఇవాళ ఈ జిల్లాల్లో వర్ష సూచన!
ఏపీలో నైరుతి ప్రభావం.. ఇవాళ ఈ జిల్లాల్లో వర్ష సూచన!

AP Rains: ఏపీలో నైరుతి ప్రభావం.. ఇవాళ ఈ జిల్లాల్లో వర్ష సూచన!

వ్రాసిన వారు Jayachandra Akuri
May 30, 2025
09:21 am

ఈ వార్తాకథనం ఏంటి

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రస్తుతం బలహీనపడింది. ఇది సాగర్ ఐలాండ్, ఖేపూపెర మధ్యగా నిన్న తీరం దాటింది. వాయుగుండం బలహీనపడిన నేపథ్యంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ప్రస్తుతం ఈ రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్ అంతటా విస్తరించి, ఒడిశా, పశ్చిమ బెంగాల్ సహా ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలకు కూడా వ్యాపించాయి.

Details

వర్ష సూచన - ఏపీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

నైరుతి రుతుపవనాల ప్రభావంతో, ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. ముఖ్యంగా ఇవాళ వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లాలు ఇవే: శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ లో కురిసే అవకాశం ఉంది.

Details

ఈదురు గాలులు, మోస్తరు నుంచి భారీ వర్షాలు

కొన్ని ప్రాంతాల్లో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇప్పటికే తెలంగాణ, కర్ణాటక, కేరళ వంటి రాష్ట్రాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. నదీ పరివాహక ప్రాంతాల్లో హెచ్చరిక ఈ వర్షాల నేపథ్యంలో గోదావరి, నాగావళి, వంశధార నదీ పరివాహకంలోని లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు జాగ్రత్త వహించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల అధికార యంత్రాంగాన్ని అలర్ట్ చేసిన ప్రభుత్వం, అవసరమైన అన్ని సూచనలను జారీ చేసింది. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండటం, అధికారుల సూచనలు పాటించటం అత్యవసరం.