Special Trains: పండగల వేళ తెలుగు ప్రజలకు గుడ్‌న్యూస్.. ఆ రూట్లలో 48 స్పెషల్ ట్రైన్లు.. పూర్తి వివరాలివే..!
దసరా, దీపావళి, ఛాత్ పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త వినిపించారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని 48 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.. ఈ ప్రత్యేక రైళ్లు అక్టోబర్ 10వ తేదీ నుంచి నవంబర్ 5 వరకు వివిధ నగరాల మధ్య అందుబాటులో ఉంటాయి. కాచిగూడ - తిరుపతి, సికింద్రాబాద్ -నాగర్‌సోల్,కాకినాడ -సికింద్రాబాద్,తిరుపతి -మచిలీపట్నం మార్గాల్లో ప్రత్యేక రైళ్లు సేవలు అందించనున్నాయి. ఈ ప్రత్యేక రైళ్లు ప్రయాణికులకు అదనపు సౌకర్యంగా ఉంటాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే కూడా ప్రయాణికుల కోసం అదనపు కోచ్‌లను ఏర్పాటు చేస్తోంది. డిమాండ్ నేపథ్యంలో 4 రైళ్లకు అదనపు స్లీపర్, ఏసీ కోచ్‌లను చేరుస్తున్నారు.
ప్రత్యేక రైళ్లు ఇవే..
సెప్టెంబర్ 3 నుంచి విశాఖ - అమృత్‌సర్ హిరాకుడ్ ఎక్స్‌ప్రెస్ (20807) రైలుకు అదనపు స్లీపర్ క్లాస్, 3 ఏసీ ఎకానమీ కోచ్‌లు శాశ్వతంగా అందుబాటులో ఉంటాయి. అదే విధంగా అమృత్‌సర్ - విశాఖ హిరాకుడ్ ఎక్స్‌ప్రెస్ (20808) రైలు కూడా సెప్టెంబర్ 7 నుంచి అదనపు కోచ్‌లతో ప్రయాణీకులకు సేవలందించనుంది. విశాఖ - నాందేడ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (20811) సెప్టెంబర్ 3 నుంచి అదనపు కోచ్‌లతో అందుబాటులోకి వస్తుంది. అలాగే, నాందేడ్ - విశాఖ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (20812) సెప్టెంబర్ 4 నుంచి మరిన్ని సౌకర్యాలతో ప్రయాణికులకు సేవలు అందించనుంది.