LOADING...
Telangana: అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణను నిలిపేందుకు స్పోర్ట్స్ పాలసీ కీలకం
అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణను నిలిపేందుకు స్పోర్ట్స్ పాలసీ కీలకం

Telangana: అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణను నిలిపేందుకు స్పోర్ట్స్ పాలసీ కీలకం

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 02, 2025
01:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శనివారం హైదరాబాద్‌ అంతర్జాతీయ కాన్వెన్షన్ సెంటర్(HICC)లో నిర్వహించే స్పోర్ట్స్ కాన్‌క్లేవ్‌ సందర్భంగా తెలంగాణ స్పోర్ట్స్ పాలసీ 2025ను అధికారికంగా విడుదల చేయనుంది. దీనికోసం రాష్ట్ర క్రీడాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ కాన్‌క్లేవ్‌ ప్రధాన ఉద్దేశం, తెలంగాణ స్పోర్ట్స్ పాలసీని క్రీడా సమాజానికి పరిచయం చేయడం, అలాగే దాని అమలులో అందరి భాగస్వామ్యాన్ని పెంపొందించడం. కార్యక్రమంలో పాల్గొనే ప్రముఖుల జాబితా ఎంతో ప్రత్యేకంగా ఉంది. స్పోర్ట్స్ విశ్లేషకుడు చారు శర్మ, ఒలింపిక్స్ లో మెరిసిన పుల్లెల గోపీచంద్, గగన్ నారంగ్, అంజు బాబీ జార్జ్ లాంటి భారత క్రీడాకారులు, వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు, విశ్వనాథన్, సభానాయక్ లాంటి ప్రముఖ క్రీడా పాత్రికేయులు ఈ వేదికపై కనిపించనున్నారు.

Details

అంతర్జాతీయ నిపుణులతో సంతకాలు

వారు వివిధ చర్చలలో, ప్యానెల్ సెషన్లలో చురుకుగా పాల్గొననున్నారు. పాలసీలో ప్రధాన ఫోకస్ చేసే అంశాల్లో - బలమైన క్రీడా పరిపాలన, దీర్ఘకాలిక క్రీడా అభివృద్ధి, ఉద్యోగ అవకాశాల నిర్మాణం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి, రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర క్రీడా మౌలిక వేదిక సృష్టి వంటి అంశాలున్నాయి. ఈ పాలసీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజన్‌ను ఆధారంగా చేసుకుని, గతేడాది పాటు తెలంగాణ స్టేట్ స్పోర్ట్స్ అథారిటీ శ్రమించి రూపొందించింది. ఇక ఈ కాన్‌క్లేవ్‌లో తెలంగాణ ప్రభుత్వం ఫీఫా (FIFA) వంటి అంతర్జాతీయ క్రీడా సంస్థలతో, ప్రముఖ కార్పొరేట్లు, నిపుణులతో MoUs (ఒప్పందాల)కు సంతకాలు చేయనుంది.

Details

క్రీడా రంగాన్ని ముందుకు తీసుకేళ్లేందుకు కృషి

ఇది రాబోయే రోజుల్లో తెలంగాణలో క్రీడా రంగాన్ని స్థిరంగా ముందుకు తీసుకెళ్లే కీలక అడుగుగా భావిస్తున్నారు. ఈ సందర్భంగా స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి మాట్లాడుతూ - "ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఇకపై నేషనల్, ఇంటర్నేషనల్ స్థాయిలో మరెన్నో ఈవెంట్లు తెలంగాణ ఆతిథ్యం వహించబోతున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రిగారి పూర్తిస్థాయి మద్దతు, క్రీడాశాఖ అధికారుల నిబద్ధతతోనే ఈ పాలసీ రూపుదిద్దుకుందన్నారు. ఈ కాన్‌క్లేవ్ ద్వారా జాతీయ స్థాయిలో స్పోర్ట్స్ పాలసీపై అవగాహన పెరిగి, దేశవ్యాప్తంగా అమలులో భాగస్వామ్యం పెరగాలన్నదే లక్ష్యం అని స్పష్టం చేశారు.