LOADING...
Narendra Modi : విజయవాడలో మోడీ రోడ్ షోకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు 
విజయవాడలో మోడీ రోడ్ షోకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు

Narendra Modi : విజయవాడలో మోడీ రోడ్ షోకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు 

వ్రాసిన వారు Sirish Praharaju
May 08, 2024
03:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించి అధికారం చేపట్టాలని కూటమి భావిస్తోంది. లోక్ సభ సీట్లు కూడా ఎక్కువ గెలవాలని టార్గెట్ విధించుకుంది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ లో పర్యటించారు. ఈరోజు మరోసారి ఏపీ రానున్నారు. ఈరోజు సాయంత్రం 7 గంటలకు ఎన్టీఏ కూటమి ఆధ్వర్యంలో విజయవాడలో రోడ్ షో నిర్వహించనున్నారు. ఈ రోడ్ షోకు ప్రధాని మోదీ,తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ హాజరవుతారు. ఈ రోడ్ షోకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

Details 

పీవీపీ మాల్‌ నుంచి బెంజ్‌ సర్కిల్‌ వరకు రోడ్ షో 

గత వారం రోజులుగా ఇక్కడే మకాం వేసిన ఎస్పీజీ పోలీసులు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. చంద్రబాబు నాయుడు, పవన్‌కల్యాణ్‌తో కలిసి నరేంద్ర మోదీ రోడ్‌షోలో పాల్గొనే పీవీపీ మాల్‌ నుంచి బెంజ్‌ సర్కిల్‌ వరకు బందర్‌ రోడ్డుపై 1.5 కిలోమీటర్ల పొడవునా బారికేడ్లు ఏర్పాటు చేశారు. నరేంద్ర మోడీ చిలకలూరిపేట బహిరంగ సభ సందర్భంగా భద్రతా లోపాలను దృష్టిలో ఉంచుకుని, మోడీ రోడ్ షోను విజయవంతం చేసేందుకు విజయవాడలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.