AP Budget: 28న రాష్ట్ర బడ్జెట్.. సూపర్‌సిక్స్ హామీల అమలుకు ప్రత్యేక కేటాయింపులు
ఈ వార్తాకథనం ఏంటి
సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యం ఇచ్చేలా 15శాతం వృద్ధి సాధనను లక్ష్యంగా పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ రూపకల్పనపై కసరత్తు చేస్తోంది.
ఈ నెల 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానుండగా, 28న పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశముంది.
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన నివాసంలో ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్, అధికారులతో కలిసి బడ్జెట్ కూర్పుపై సమీక్ష నిర్వహించారు.
సూపర్‌సిక్స్ హామీల అమలుకు శ్రీకారం
సూపర్‌సిక్స్ హామీల్లో భాగంగా 'తల్లికి వందనం', 'అన్నదాతా సుఖీభవ', మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాలను కొత్త ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్ మొత్తాన్ని పంపిణీ చేయడంతో పాటు, 'దీపం-2', 'అన్న క్యాంటీన్లు' ఇప్పటికే ప్రారంభమయ్యాయి.
Details
ఆర్థిక స్థితిగతులపై ప్రభుత్వం దృష్టి
గత వైసీపీ ప్రభుత్వం భవిష్యత్తు ఆదాయాలను వినియోగించడంతో పాటు మూలధన వ్యయానికి తగినంత నిధులు ఖర్చు చేయకపోవడంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సమస్యలు ఎదుర్కొంటోంది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఉచిత ఇసుక విధానం అమలు చేయడంతో ఆదాయంలో కొంత కోత పడింది.
పోలవరం, అమరావతికి కేంద్ర సహాయం
పోలవరం, అమరావతి ప్రాజెక్టులకు కేంద్రం ఇచ్చిన ఆర్థిక సాయం రాష్ట్రానికి కొంత ఊరటనిచ్చినా ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కేంద్రం నుంచి ప్రత్యేక సాయం అవసరమని సీఎం చంద్రబాబు ఇప్పటికే 16వ ఆర్థిక సంఘాన్ని కోరారు.