Hydra: హైడ్రా బలోపేతం దిశగా అడుగులు.. 23 మందిని నియమిస్తూ ఉత్తర్వులు
హైడ్రా బలోపేతం దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులేస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ చెరువుల్లో జరుగుతున్న ఆక్రమణల తొలగింపుతో హైడ్రా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న 23 మంది పోలీసు అధికారులను హైడ్రాలో నియమిస్తూ రాష్ట్ర శాంతి భద్రతల విభాగం డీజీ మహేశ్ భగవత్ ఉత్తర్వులు జారీ చేశారు. వారిలో 15 మంది ఇన్‌స్పెక్టర్లు, ముగ్గురు ఆర్‌ఐలు, ఇద్దరు ఆర్‌ఎస్సైలు, ముగ్గురు ఎస్సైలు ఉన్నారు.
శాంతి భద్రతలు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు
ఆక్రమణల తొలగింపు సమయంలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ఉన్నతాధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. కేసుల నమోదు, దర్యాప్తు కోసం హైడ్రాకు ప్రత్యేక పోలీస్‌స్టేషన్లు ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. ఈ నేపథ్యంలోని ముందుగానే పోలీసు సిబ్బందిని కేటాయించారని సమాచారం.