Stone attack on Train: వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి.. ఐదుగురి అరెస్టు
వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఛత్తీస్‌గఢ్‌లోని బగ్బాహారా రైల్వేస్టేషన్ వద్ద ట్రయల్ రన్ జరుగుతుండగా, కొందరు ఆకతాయిలు రైలు అద్దాలపై రాళ్ల దాడి చేశారు. దుర్గ్-విశాఖపట్నం వందేభారత్ ఎక్స్‌ప్రెస్ సేవలను ప్రారంభించే ముందు ఈ ఘటన చోటుచేసుకుంది. దాడి కారణంగా మూడు బోగీల అద్దాలు ధ్వంసమయ్యాయి. రైల్వే పోలీసులు తక్షణమే స్పందించి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు బగ్బాహారా ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించి వారిపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
తెలుగు రాష్ట్రాలకు మరో రెండు వందేభారత్ రైళ్లు
తెలుగు రాష్ట్రాలకు మరో రెండు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయని కేంద్ర గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. వీటిని సెప్టెంబర్ 16న అహ్మదాబాద్ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ఈ రైళ్లలో ఒకటి హైదరాబాద్-నాగ్‌పుర్ మధ్య, మరొకటి విశాఖపట్నం-దుర్గ్ మధ్య రాకపోకలు సాగించనున్నాయి. విశాఖపట్నం-దుర్గ్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ మూడు రాష్ట్రాలు ఏపీ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లలో సేవలు అందించనుంది. ఈ రైలు దుర్గ్‌లో ఉదయం 5.45కి బయలుదేరి, మధ్యాహ్నం 1.45కి విశాఖపట్నం చేరుతుంది. తిరిగి మధ్యాహ్నం 2.50కి బయలుదేరి రాత్రి 10.50కి దుర్గ్ చేరుకుంటుంది.