దిల్లీ-ఎన్సీఆర్‌లో వీహెచ్‌పీ-బజరంగ్ దళ్ ర్యాలీలను ఆపాలని సుప్రీంకోర్టులో పిటిషన్
హర్యానాలోని నుహ్, గురుగ్రామ్‌లలో జరిగిన ఘర్షణల నేపథ్యంలో దిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ చేపట్టాలని ర్యాలీలను ఆపేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ద్వేషపూరిత ప్రసంగాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న రిట్ పిటిషన్‌లో ఈ వ్యాజ్యాన్ని ఇంటర్‌లోక్యుటరీ అప్లికేషన్ (ఏఐ)గా దాఖలు చేశారు. ర్యాలీలను నిలిపివేయాలంటూ సీనియర్ న్యాయవాది సీయూ సింగ్ సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్‌ను దాఖలు చేశారు. 'నుహ్ హింసకు' నిరసనగా దిల్లీ-ఎన్‌సీఆర్‌లోని పలు ప్రాంతాల్లో వీహెచ్‌పీ, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో 27మార్చ్‌లు నిర్వహించనున్నట్లు న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలియజేశారు. దీంతో ఈ పిటిషన్‌పై స్పందించిన సీజేఐ, దీన్ని వెంటనే జాబితా చేయాలని రిజాస్టార్‌ను ఆదేశిస్తానని చెప్పారు.