Prashant Kishore: లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే క్లీన్ స్వీప్: ప్రశాంత్ కిషోర్ జోస్యం
బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఎన్డీఏలోకి తిరిగి రావడంపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక కామెంట్స్ చేశారు. బిహార్‌లో రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని కూటమి 'క్లీన్ స్వీప్' చేస్తుందని జోస్యం చెప్పారు. బిహార్‌లో ఎన్డీయే నేతృత్వంలోకి నితీష్ కుమార్ మళ్లీ రావడంపై ప్రశాంత్ కిషోర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. లోక్ సభ ఎన్నికల్లో బిహార్‌లో బీజేపీ సొంతంగా పోరాడి ఉంటే మరింత లాభదాయకంగా ఉండేదని కూడా ప్రశాంత్ కిషోర్ అన్నారు. బీజేపీని విధ్వంసక పార్టీ అని ప్రశాంత్ కిషోర్ అభివర్ణించారు. ఇండియా కూటమిని నాశనం చేసేందుకే నితీష్ కుమార్‌ను ఎన్డీఏలోకి బీజేపీ లాగిందన్నారు.
నితీష్ చివరి ఇన్నింగ్స్‌ను ఆడుతున్నారు: ప్రశాంత్ కిషోర్
నితీష్ తన జీవితంలో చివరి ఇన్నింగ్స్‌ను ఆడుతున్నారని ప్రశాంత్ కిషోర్ అన్నారు. ఆయన ఎప్పుడు ఏం చేస్తారో ఎవరికీ తెలియదన్నారు. బిహార్ ప్రజలు అతన్ని తిరస్కరించారన్నారు. కాబట్టి అతను తన కుర్చీని కాపాడుకోవడానికి ఏదైనా చేయగలరన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలు నరేంద్ర మోదీ చూట్టూనే జరుగుతాయన్నారు. నితీష్ కుమార్ ఎన్డీఏలోకి తిరిగి రావడం బీజేపీకే నష్టం జరుగుతుందన్నారు. నితీశ్ కుమార్‌పై బిహార్ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. నితీష్ కుమార్ ఏ కూటమి నుంచి పోటీ చేసినా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పార్టీకి 20 సీట్లు కూడా రావు అన్నారు. తన మాట అబద్ధం అయితే.. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు.