LOADING...
Anil Chauhan: భారత్‌కు'సుదర్శన్ చక్ర' కవచం.. 2035 నాటికి అందుబాటులోకి వస్తుందన్న సీడీఎస్ అనిల్ చౌహాన్ 
2035 నాటికి అందుబాటులోకి వస్తుందన్న సీడీఎస్ అనిల్ చౌహాన్

Anil Chauhan: భారత్‌కు'సుదర్శన్ చక్ర' కవచం.. 2035 నాటికి అందుబాటులోకి వస్తుందన్న సీడీఎస్ అనిల్ చౌహాన్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 26, 2025
11:38 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత రక్షణ వ్యవస్థను శత్రువుల దాడుల నుంచి మరింత సురక్షితం చేయడానికి దేశీయంగా ఒక శక్తివంతమైన అస్త్రాన్ని రూపొందిస్తున్నారు. ఇజ్రాయెల్‌ ప్రసిద్ధ ఐరన్ డోమ్‌లాంటి సాంకేతికతను ఆధారంగా తీసుకుని, 'సుదర్శన చక్ర' అనే కొత్త రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నట్లు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ తెలిపారు. ఈ వ్యవస్థ పూర్తి స్థాయిలో 2035 నాటికి అందుబాటులోకి రాబోతోంది అని ఆయన స్పష్టత ఇచ్చారు. మధ్యప్రదేశ్‌లో మంగళవారం మోవ్‌లోని ఆర్మీ వార్ కాలేజీ‌లో మొదటిసారిగా నిర్వహించిన త్రివిధ దళాల సదస్సు 'రణ్ సంవాద్'లో ప్రసంగిస్తున్నప్పుడు, యుద్ధ తంత్రంపై సాంకేతిక పరిజ్ఞానం ప్రభావం అంశంపై లోతైన చర్చ అవసరమని జనరల్ చౌహాన్ చెప్పారు.

వివరాలు 

త్రువులపై దాడి చేసే ఆయుధంగానూ పనిచేస్తుంది 

స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావించిన 'సుదర్శన చక్ర' ప్రాజెక్టుపై ఆయన ప్రత్యేకంగా వివరించారు. జనరల్ చౌహాన్ వివరాల ప్రకారం,భారత్‌ సొంతంగా రూపొందిస్తున్న'సుదర్శన చక్రం'ఈ సదస్సులో రెండో ప్రధాన చర్చా అంశంగా నిలిచింది. దేశంలోని వ్యూహాత్మక ప్రదేశాలు,పౌరులు,జాతీయ ప్రాముఖ్యత కలిగిన ప్రాంతాలకు సమగ్ర రక్షణను అందించడమే ఈ వ్యవస్థ ప్రధాన లక్ష్యం. ఇది కేవలం రక్షణ కవచం మాత్రమే కాకుండా,శత్రువులపై ప్రత్యక్ష దాడి చేసే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటుందని ఆయన వెల్లడించారు. శత్రు లక్ష్యాలను గుర్తించడం,అవి చేసే దాడులను ఛేదించడం, నాశనం చేయడం వంటి సామర్థ్యాలు ఈ వ్యవస్థలో ఉంటాయని ఆయన వివరించారు. కైనెటిక్, డైరెక్టెడ్ ఎనర్జీ వంటి అత్యాధునిక ఆయుధాలను ఇందులో వినియోగిస్తారని కూడా చెప్పారు.

వివరాలు 

భవిష్యత్ యుద్ధాలకు అనుగుణంగా సాయుధ దళాలను తీర్చిదిద్దే లక్ష్యం

భారత్ యుద్ధ తంత్రం, సాంకేతికత, నాయకత్వం వంటి అన్ని రంగాల్లో శ్రద్ధగా పరిశోధన చేయాల్సిన అవసరం ఉందని జనరల్ చౌహాన్ పేర్కొన్నారు. "'వికసిత భారత్'గా మన దేశం కేవలం సాంకేతికంగా మాత్రమే కాదు, ఆలోచనలు, ఆచరణలోనూ సురక్షిత, శక్తివంతమైన, ఆత్మనిర్భర దేశంగా ఉండాలి" అని ఆయన అభిప్రాయపడ్డారు. జాతీయ భద్రతకు సంబంధించి సామాజిక అవగాహన పెంపొందించాల్సిన అవసరాన్ని ఆయన హైలైట్ చేశారు. భవిష్యత్తు యుద్ధాలకు అనుగుణంగా సాయుధ దళాలను తయారుచేయడంలో కీలక అంశాలను ఈ సదస్సులో చర్చించగా, ప్రాథమిక, వ్యూహాత్మక తీర్మానాలు తీసుకున్నారు.