Page Loader
Suneetha Narreddy: పదే పదే ఎవర్నీ మోసం చేయలేరుః సునీత నర్రెడ్డి 
పదే పదే ఎవర్నీ మోసం చేయలేరుః సునీత నర్రెడ్డి

Suneetha Narreddy: పదే పదే ఎవర్నీ మోసం చేయలేరుః సునీత నర్రెడ్డి 

వ్రాసిన వారు Stalin
Apr 02, 2024
08:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎవరినైనా ఒకసారే మోసం చేయగలరని, పదే పదే మోసం చేయలేరని గ్రహించాలని వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె నర్రెడ్డి సునీత పేర్కొన్నారు. తాను, వైఎస్‌ షర్మిల ఎవరి ప్రభావంతోనో తప్పుడు ఆరోపణలు చేస్తున్నట్లు ఏపీ సీఎం వై.ఎస్‌.జగన్‌ అనుకుంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గుడ్డిగా మిమ్మల్ని నమ్మి తప్పులు చేయాల్సి వచ్చిందని, తన తప్పును గ్రహించి దాన్ని సరిదిద్దుకునే సమయం వచ్చిందని ఆమె పేర్కొన్నారు. హైదరాబాద్, కడపలో తాను అడిగిన ప్రశ్నలకు సీఎం జగన్‌ అన్నగా కాకపోయినా ముఖ్యమంత్రిగానైనా సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్‌ చేశారు. వివేకానందరెడ్డి హత్య కేసులో వాస్తవలేంటో ప్రజలందరికీ తెలుసునని చెప్పారు.

Details

మీ ఛానల్ కి వస్తా డిబేట్ చేద్దాం.. 

వివేకాను చంపిందెవరో ఆ దేవుడు, కడప ప్రజలందరికీ తెలుసనని సీఎం జగన్‌ అన్నారని, అయితే కడప జిల్లా ప్ర జల్లో జగన్‌ కూడా ఒకరని అంటే నిజమేమిటో ఆయనకు కూడా తెలుసా అని నిలదీశారు. అవినాష్‌ రెడ్డిని ఎందుకు కాపాడుతున్నారో సీఎం జగన్‌ సమాధానం చెప్పాలన్నారు. ఈ కేసులో అవినాష్‌ ప్రమేయం ఉందని తెలిస్తే ఇంకా నిజాలైమేనా బయటకొస్తాయని భయపడుతున్నారా అని ప్రశ్నించారు. తనకు ధైర్యముందని మీ చానల్‌ లో దీనిపై డిబేట్‌ పెడితే తాను చర్చకు వస్తానని చెప్పారు. చర్చలో ఎవరేం చెబుతున్నారో ప్రజలే అర్థం చేసుకుంటారని సునీత పేర్కొన్నారు.