Supreme Court : కేజ్రీవాల్ పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకారం
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టును వ్యతిరేకిస్తూ అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి పిటిషన్‌ను జస్టిస్ సంజీవ్ ఖన్నా,జస్టిస్ ఎంఎం సుందరేష్,జస్టిస్ బేలా ద్వివేదిలతో కూడిన ప్రత్యేక ధర్మాసనం విచారించనుంది. కేజ్రీవాల్ అరెస్టుకు వ్యతిరేకంగా ఆప్ మద్దతుదారులు దేశవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చారు.ఈ నిరసనలో పాల్గొనాల్సిందిగా ఆప్ ఇండియా బ్లాక్‌ని కూడా ఆహ్వానించింది. కాగా,గురువారం సాయంత్రం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆయనను ప్రశ్నించి,ఆయన ఇంట్లో సోదాలు చేసిన తర్వాత అరెస్టు చేసింది. దీంతో కేజ్రీవాల్ న్యాయవాదులు వెంటనే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ అంశాన్ని అత్యవసర జాబితాలో చేర్చి విచారణ జరపాల్సిందిగా న్యాయస్థానానికి విన్నవించింది.