Electoral Bonds: ఎలక్టోరల్ బాండ్ నంబర్లను వెల్లడించనందుకు ఎస్‌బీఐకి సుప్రీంకోర్టు నోటీసు
ఎలక్టోరల్ బాండ్స్ కేసులో వివరాలు పూర్తి స్థాయిలో వెల్లడించనందుకు, తద్వారా గతంలో ఇచ్చిన తీర్పును పాటించనందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ)కి సుప్రీంకోర్టు శుక్రవారం నోటీసు జారీ చేసింది. దాతలను గ్రహీతలకు లింక్ చేసే ఎలక్టోరల్ బాండ్ నంబర్‌లను రుణదాత తప్పనిసరిగా వెల్లడించాలని సుప్రీం కోర్టు నిర్ద్వందంగా పేర్కొంది. ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం, లోపాన్ని వివరించాలని ఎస్‌బిఐకి నోటీసు జారీ చేసింది. ఈ అంశాన్ని సోమవారం, మార్చి 18కి విచారణకు వాయిదా వేసింది.