మాన్యువల్ స్కావెంజర్స్‌పై సుప్రీం సంచలన తీర్పు.. వారు మరణిస్తే రూ.30 లక్షల పరిహారం
మాన్యువల్ స్కావెంజర్స్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ మేరకు మురుగు కాల్వలను శుభ్రం చేసే క్రమంలో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని సుప్రీం ఆందోళన వ్యక్తం చేసింది. చేతులతో మురుగును శుభ్రం చేసే కార్మికులు మరణిస్తే, బాధిత కుటుంబాలకు రూ.20 లక్షల పరిహారం అందజేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా మురుగును శుభ్రం చేస్తున్న సందర్భంలో చాలా మంది మరణిస్తున్నారని, కొందరు వైకల్యానికి గురవుతున్నారంటూ పిల్ దాఖలైంది. జస్టిస్ ఎస్.రవీంద్రభట్, జస్టిస్ అర్వింద్ కుమార్ లతో కూడిన బెంచ్ ఈ పిటిషన్ విచారించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాన్యువల్ స్కావెంజింగ్‌ను సమూలంగా నిర్మూలించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని ధర్మాసనం తేల్చి చెప్పింది.
మాన్యువల్ స్కావెంజింగ్‌పై నిషేధం ఉన్నా పనులు చేయిస్తున్నారు : పిటిషనర్లు
మాన్యువల్ స్కావెంజర్‌గా పనిచేస్తూ ప్రాణాలు కోల్పోయిన వారికి రూ.30 లక్షలు ఇవ్వాలని ఆదేశించింది. ఇదే సమయంలో శాశ్వత వైకల్యానికి గురైన వారికి రూ. 20 లక్షలను పరిహారంగా అందజేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఇతర రకాల వైకల్యానికి గురైతే రూ.10లక్షల చొప్పున నిధలు ఇవ్వాలని తీర్పినిచ్చింది. మరోవైపు ప్రమాద ఘటనలు జరగకుండా ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని సూచించింది. గత ఐదేళ్లలో మురుగు కాల్వలను శుభ్రం చేస్తూ సుమారుగా 350 మంది పారిశుద్ధ్య కార్మికులు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. దిల్లీ, యూపీ, తమిళనాడు రాష్ట్రాల్లో 40 శాతం మరణాలు సంభవించాయిని 2022లో లోక్‌సభలో ప్రభుత్వం వెల్లడించింది. మాన్యువల్ స్కావెంజింగ్‌పై ఇప్పటికే నిషేధం కొసాగుతోంది. వీరికి పునరావాసం కల్పించాలని చట్టం ఉంది.