Page Loader
Supreme Court: యూపీ మదర్సా చట్టాన్ని రద్దు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే 
యూపీ మదర్సా చట్టాన్ని రద్దు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే

Supreme Court: యూపీ మదర్సా చట్టాన్ని రద్దు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 05, 2024
04:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర్‌ప్రదేశ్ మదర్సా చట్టాన్ని రద్దు చేస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించి,భారీ ఉపశమనం కల్పించింది. దీనిపై శుక్రవారం సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. సుప్రీం ఇచ్చిన స్టే తో యూపీ లోని 16,000 మదర్సాలు అంతకముందులాగానే పనిచేయనున్నాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం కేంద్రానికి, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. సప్రీంకోర్టు తదుపరి విచారణను జూలై రెండో వారానికి వాయిదా వేసింది.

Details 

మదర్సా బోర్డు ఏర్పాటు సెక్యులరిజాన్ని ప్రభావితం చేయదు: సుప్రీం 

గత నెలలో, అలహాబాద్ హైకోర్టు ఉత్తర్‌ప్రదేశ్ బోర్డ్ ఆఫ్ మదర్సా ఎడ్యుకేషన్ యాక్ట్, 2004, సెక్యులరిజం సూత్రాన్ని ఉల్లంఘించినట్లు ప్రకటించింది. ఇది రాజ్యాంగ విరుద్ధం అని పేర్కొంటూ అలహాబాద్ హైకోర్టు గత నెలలో తీర్పు ఇచ్చింది. మదర్సాలు లౌకిక విద్యను అందించాలనే ఉద్దేశ్యంతో అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ వేయబడిందని పేర్కొన్న సుప్రీంకోర్టు, చట్టాన్ని కొట్టివేయడం దీనికి పరిష్కారం కాదని పేర్కొంది. మదర్సా విద్యార్థులకు అధికారిక విద్యా విధానానికి మ‌ళ్లించే ప‌థకాన్ని రూపొందించాల‌ని జ‌స్టిస్ వివేక్ చౌదరి, జ‌స్టిస్ సుభాష్ విద్యార్ధితో కూడిన ధ‌ర్మాస‌నం యూపీ ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది. అయితే, మదర్సా బోర్డు లక్ష్యాలు నియంత్రణ స్వభావం కలిగి ఉన్నాయని, మదర్సా బోర్డు ఏర్పాటు సెక్యులరిజాన్ని ప్రభావితం చేయదని సుప్రీంకోర్టు పేర్కొంది.