Supreme Court: న్యూస్ క్లిక్ వ్యవస్ధాపకుడిని విడుదలకు పచ్చజెండా ఊపిన సుప్రీం
న్యూస్ క్లిక్ వ్యవస్ధాపకులు ప్రబీర్ పురకాయస్ధను తక్షణమే విడుదల చేయాలని సుప్రీంకోర్టు గురువారం ఆదేశించింది. జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై ఆయనను అరెస్ట్ చేయడం తగదని జస్టిస్ గవాయ్,సందీప్ మెహతాలతో కూడిన బెంచ్ అభిప్రాయపడింది. అరెస్ట్ కు సంబంధించి తగిన సాక్ష్యాధారాలను రిమాండ్ రిపోర్ట్ లో చూపలేదని ఢిల్లీ పోలీసులను బెంచ్ తప్పుపట్టింది. పురకాయస్ధ రిమాండ్ కు తగిన కారణాలను తమ ముందు ఉంచలేదని బెంచ్ వ్యాఖ్యానించింది. అయితే అదనపు సోలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు.. ఢిల్లీ పోలీసుల చర్యను సమర్ధించారు. కేవలం పురకాయస్ధ లాయర్ కి చెప్పి ఢిల్లీ పోలీసులు అతనిని అరెస్ట్ చేయడం తగదని జస్టిస్ గవాయ్ అభిప్రాయ పడ్డారు. పోలీసులు చట్టాలను అతిక్రమించారన్నారు.