Puja Khedkar: పూజా ఖేద్కర్‌కు గుడ్‌న్యూస్.. అరెస్ట్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
ఈ వార్తాకథనం ఏంటి
మాజీ ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేద్కర్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది.
ఆమెను ఫిబ్రవరి 14 వరకు అరెస్ట్ చేయవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఈ కేసును పర్యవేక్షించిన ధర్మాసనంలో జస్టిస్ బీవీ నాగరత్న, సతీష్ చంద్ర శర్మ ఉన్నారు.
ఈ ధర్మాసనం ఢిల్లీ ప్రభుత్వానికి, యూపీఎస్సీకి నోటీసులు జారీ చేసింది.
గత ఏడాది పూజా ఖేద్కర్ ఉద్యోగ విషయంగా పెద్ద ఇబ్బందులకు గురయ్యారు. పూణెలో ట్రైనీ ఐఏఎస్‌గా పని చేస్తున్నప్పుడు, ఆమె సౌకర్యాలు లేకుండా కూడా అధికారులతో గొడవలకు దిగారు.
తన తండ్రితో కలిసి ఆమె అధికారులను బెదిరించి, మరింత సౌకర్యాలు కోరుతూ సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది.
వివరాలు
సర్వీసు రద్దు చేసిన యూపీఎస్సీ
ఈ వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసిన తర్వాత, ఆమెను పూణె నుండి ట్రాన్స్‌ఫర్ చేశారు.
అప్పుడే ఆమె దుర్వినియోగం బయటపడింది. పత్రాల తప్పుడు వాడకం ద్వారా ఉద్యోగం పొందినట్లు తెలుస్తోంది.
ఈ వ్యవహారం యూపీఎస్సీ దృష్టికి వెళ్లడంతో, వారు విచారణ చేపట్టి నిజమని నిర్ధారించారు. అనంతరం ఢిల్లీ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు.
2022లో జరిగిన యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలో పూజా ఖేద్కర్ రిజర్వేషన్ ప్రయోజనాలు పొందేందుకు తప్పుడు సమాచారాన్ని నమోదు చేసినట్లు తెలుస్తోంది.
ఆమె ఓబీసీ,దివ్యాంగుల కోటాను దుర్వినియోగం చేసిందని బయటపడింది. తద్వారా ఆమె సర్వీసు యూపీఎస్సీ రద్దు చేసింది.
వివరాలు
ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన పూజా ఖేద్కర్
ఆమె భవిష్యత్తులో ఎలాంటి పరీక్షల్లో పాల్గొనకుండా వేటు వేసింది.
ఢిల్లీ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేయడంతో, పూజా ఖేద్కర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.
కానీ కోర్టు ఆమెకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది, ఆమె దేశం మొత్తాన్ని మోసం చేశారని తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
దీంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించింది. జస్టిస్‌లు బీవీ నాగరత్న,సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం, ఆమెను ఫిబ్రవరి 14 వరకు అరెస్ట్ చేయొద్దని ఆదేశించారు.