LOADING...
Supreme Court: సలహాదారు మాత్రమే కాదు.. స్కామ్‌కు ఆర్కిటెక్ట్‌ రాజ్‌ కెసిరెడ్డి: సుప్రీంకోర్టు
సలహాదారు మాత్రమే కాదు.. స్కామ్‌కు ఆర్కిటెక్ట్‌ రాజ్‌ కెసిరెడ్డి: సుప్రీంకోర్టు

Supreme Court: సలహాదారు మాత్రమే కాదు.. స్కామ్‌కు ఆర్కిటెక్ట్‌ రాజ్‌ కెసిరెడ్డి: సుప్రీంకోర్టు

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 12, 2026
02:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఏపీ మద్యం కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్‌ కెసిరెడ్డి దాఖలు చేసిన రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్‌ను విచారణకు కూడా స్వీకరించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ సందర్భంగా ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఏపీ మద్యం కుంభకోణం చాలా భారీ స్థాయిలో జరిగిందని, అధికారుల పరస్పర కుమ్మక్కు లేకుండా ఇలాంటి అక్రమాలు జరగవని సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ స్పష్టం చేశారు. ఇలాంటి వ్యవహారాల్లో భాగమైన అధికారులను ఇప్పటికీ అరెస్ట్‌ చేయకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. రాజ్‌ కెసిరెడ్డి ప్రభుత్వానికి కేవలం సలహాదారుడేనని ఆయన తరఫు న్యాయవాది వాదించగా, ఆ వాదనను ధర్మాసనం ఖండించింది.

వివరాలు 

పిటిషన్‌ను ఉపసంహరించుకోడానికి అనుమతి

కెసిరెడ్డి సలహాదారుడిగా మాత్రమే కాకుండా మొత్తం మద్యం స్కామ్‌కు ఆయనే రూపకర్త అని కోర్టు స్పష్టం చేసింది. పదవిలో ఉన్న వ్యక్తుల మద్దతు లేకుండా అధికారులు ఇలాంటి చర్యలకు పాల్పడలేరని కూడా ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ కేసులో తాను ఇప్పటికే దాదాపు పది నెలలుగా జైలులో ఉన్నానని, సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్లు కూడా దాఖలయ్యాయని కెసిరెడ్డి తరఫు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. అయితే దీనిపై స్పందించిన జస్టిస్‌ సూర్యకాంత్‌.. ఏం కాదని.. మరికొంతకాలం జైలులో ఉండనీయండని జస్టిస్‌ సూర్యకాంత్‌ వ్యాఖ్యానించారు. కెసిరెడ్డికి రెగ్యులర్‌ బెయిల్‌ ఇచ్చేందుకు ధర్మాసనం ససేమిరా అంటూ పిటిషన్‌ను డిస్మిస్‌ చేసేందుకు సిద్ధమైంది ఈ నేపథ్యంలో పిటిషన్‌ను ఉపసంహరించుకుంటామని కెసిరెడ్డి తరఫు న్యాయవాది కోరడంతో, కోర్టు అందుకు అనుమతి ఇచ్చింది.

Advertisement