తదుపరి వార్తా కథనం

MLC kavitha: కవితకు మరోసారి నిరాశే.. విచారణ వాయిదా
వ్రాసిన వారు
Sirish Praharaju
Aug 12, 2024
01:23 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయ్యి జైలులో ఉన్న బీఆర్ఎస్ MLC కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టులో మరోసారి నిరాశే ఎదురైంది.
ఈ కేసులో ఆమె బెయిల్ కోరుతూ వేసిన పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. ఈనెల 20కి విచారణ వాయిదా వేసిన కోర్టు.. సీబీఐ, ఈడీలకు నోటీసులు జారీ చేసింది.
కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. వాదనల తర్వాత నిర్ణయం తీసుకుంటామని ధర్మాసనం పేర్కొంది.
న్యాయమూర్తులు బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసును ఆగస్టు 20కి విచారణకు వాయిదా వేసింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
కవితకు మరోసారి నిరాశే
Delhi Excise Policy case: Supreme Court seeks ED, CBI response to K Kavitha bail plea
— Bar and Bench (@barandbench) August 12, 2024
Read story here: https://t.co/vcukp3jPM5 pic.twitter.com/kn5N2cPOra