
Supreme Court: వక్ఫ్ చట్టం-2025లో కీలక ప్రావిజన్‌ను నిలిపేసిన సుప్రీంకోర్టు..!
ఈ వార్తాకథనం ఏంటి
వక్ఫ్ (సవరణ) చట్టం-2025లోని ఒక ముఖ్య ప్రావిజన్‌ను సుప్రీంకోర్టు నిలిపివేసింది. ఈ చట్టంలో కనీసం ఐదు సంవత్సరాల పాటు ఇస్లాం మతాన్ని అనుసరించిన వ్యక్తి మాత్రమే ఆస్తిని వక్ఫ్ చేయగలనే నిబంధన ఉంది. ఒక వ్యక్తి ఇస్లాంను అనుసరిస్తున్నట్లు నిర్ణయించేలా నిబంధనలు తయారుచేసేవరకు ఇది అమల్లో ఉండదని చెప్పింది. కానీ మొత్తం వక్ఫ్ (సవరణ)చట్టంపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంలో నిరాకరించింది. కొందరు సెక్షన్లకు మాత్రమే తాత్కాలిక రక్షణ అవసరం అని కోర్టు వ్యాఖ్యానించింది. వక్ఫ్ బోర్డ్‌లో ముస్లిం సభ్యులు మెజార్టీలో ఉండాలని,బోర్డ్ లేదా కౌన్సిల్‌లో అత్యధికంగా మూడు లేదా నాలుగు ముస్లిమేతర సభ్యులు మాత్రమే ఉండేలా చూడాలని కోర్టు సూచించింది. అలాగే,చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ముస్లిం వ్యక్తి ఉండటం మంచిదని కూడా పేర్కొంది.
వివరాలు
బ్లిల్లును క్లియర్ చేసిన గంటల్లోనే సుప్రీంకోర్టుకు..
ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ (సవరణ) చట్టం-2025ను పూర్తిగా నిలిపివేయాలనే దాదాపు 100 పైగా పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. వీటిలో, ముస్లింల ఆస్తులను మెల్లగా సేకరించడానికి చట్టం ఉపయోగపడే అవకాశం ఉందని ఆరోపణలు ఉన్నాయి. అయితే, కేంద్రం ఈ చట్టాన్ని పబ్లిక్, ప్రైవేట్ ఆక్రణలకు దూరంగా ఉంచి రక్షించడానికి ప్రవేశపెట్టినట్లు వాదించింది. వాస్తవానికి, ఈ కేసు పార్లమెంట్‌లో చట్టం ఆమోదించబడిన రోజే సుప్రీంకోర్టుకు చేరింది. ముఖ్యంగా కోర్టులు వక్ఫ్ ఆస్తిగా గుర్తించినవి, వ్యక్తుల డీడ్ల ఆధారంగా వక్ఫ్ చేయబడిన ఆస్తుల డీనోటిఫై అధికారాలను చట్టం కింద ప్రశ్నించిన అంశాలు ఈ కేసులో ప్రధానంగా ఉన్నాయి.