తెలంగాణ హైకోర్టు ఆదేశాలను కొట్టేసిన సుప్రీంకోర్టు; అవినాష్ రెడ్డి అరెస్టుకు లైన్ క్లియర్
వైఎస్ వివేకా హత్య కేసులో లోక్‌సభ సభ్యుడు వైఎస్ అవినాష్‌రెడ్డిని అరెస్టు చేయకుండా కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)ని ఆదేశించిన తెలంగాణ హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. హైకోర్టు ఉత్తర్వులు దర్యాప్తుకు తీవ్ర విఘాతం కలిగిస్తున్నాయని సీజేఐ డివై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం తీర్పులో పేర్కొంది. ఈ వ్యవహారంలో చివరి విచారణలో హైకోర్టు జారీ చేసిన ఆదేశాలు ఆమోదయోగ్యం కాదని ప్రధాన న్యాయమూర్తి మౌఖికంగా వ్యాఖ్యానించారు.
ఏప్రిల్ 25న తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ
వైఎస్ వివేకా కుమార్తె సునీతారెడ్డి తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా వాదించారు. అవినాష్ రెడ్డికి సంధించిన ప్రశ్నలను ముద్రించిన లేదా రాతపూర్వక రూపంలో అందించాలని తెలంగాణ హైకోర్టు సీబీఐని ఆదేశించడం అసంబద్ధం అని వాదించారు. మెరిట్‌ల ఆధారంగా అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను హైకోర్టు కొనసాగించవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది. ముందస్తు బెయిల్ పిటిషన్ ఏప్రిల్ 25న తెలంగాణ హైకోర్టులో విచారణకు రానున్నందున, కనీసం 24 గంటలపాటు అరెస్ట్ కాకుండా కాపాడాలంటూ అవినాష్ రెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది రంజిత్ కుమార్ చేసిన వాదనలను సుప్రీంకోర్టు కూడా తోసిపుచ్చింది.
ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి