NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Chandrababu Bail: చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ 
    తదుపరి వార్తా కథనం
    Chandrababu Bail: చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ 
    Chandrababu Bail: చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ

    Chandrababu Bail: చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 26, 2024
    09:14 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బెయిల్‌ను రద్దు చేయాలని దాఖలైన పిటిషన్‌పై సోమవారం (ఫిబ్రవరి 26) సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది.

    గతంలో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలంటూ పిటిషన్ దాఖలైంది.

    చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌ను జస్టిస్ బేల ఎం. త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించనుంది.

    ఈ పిటిషన్‌పై ఫిబ్రవరి 12న సుప్రీంకోర్టులో విచారణ జరగగా, ధర్మాసనం రెండు వారాల (ఫిబ్రవరి 26)కి వాయిదా వేసింది.

    చంద్రబాబుకు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని ఏపీ సీఐడీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

    Details 

    కేసును రెండు వారాలకు వాయిదా వేసిన సుప్రీంకోర్టు

    సుప్రీంకోర్టు ధర్మాసనం ఈరోజు తదుపరి విచారణ చేపట్టనుంది.

    రెండు వారాల కిందటే జరిగిన విచారణలో భాగంగా న్యాయవాది హరీశ్ సాల్వే కొన్ని ఇబ్బందుల కారణంగా ఆ రోజు కోర్టుకు రాలేకపోయినట్లు మరో న్యాయవాది సిద్ధార్థ లూత్రా వివరించారు. అందుకే కేసును 3 వారాల పాటు వాయిదా వేసింది.

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సీఐడీ తరపు న్యాయవాది రంజిత్ కుమార్ మాట్లాడుతూ వీలైనంత త్వరగా తేదీ ఇవ్వాలని అభ్యర్థించారు.

    ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు కేసును రెండు వారాలకు వాయిదా వేసింది.

    అందులో భాగంగానే ఈ కేసును ఫిబ్రవరి 26న విచారిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. సోమవారం జస్టిస్ బేల ఎమ్ త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ లతో కూడిన ధర్మాసనం విచారించనుంది.

    Details 

    సెప్టెంబర్ లో అరెస్ట్.. నవంబర్ లో బెయిల్

    ఏపీ స్కిల్ కేసులో ఏపీ హైకోర్టు చంద్రబాబుకు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ గతేడాది ఏపీ సీఐడీ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది.

    స్కిల్ కేసులో గతేడాది సెప్టెంబర్ లో చంద్రబాబు అరెస్ట్ కాగా, నవంబర్ లో ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.

    ఏపీ హైకోర్టు తొలుత తాత్కాలిక బెయిల్‌ను మంజూరు చేసి, ఆ తర్వాత సాధారణ బెయిల్ మంజూరు చేసింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను సవాల్ చేస్తూ ఏపీ సీఐడీ సుప్రీంకోర్టుకు వెళ్లింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    స్కిల్ డెవలప్ మెంట్ కేసు

    తాజా

    Hyundai: తెలంగాణలో  హ్యుందాయ్‌ భారీ టెస్ట్ సెంటర్‌ ఏర్పాటు .. రాష్ట్రంలో 675 ఎకరాల్లో రూ.8,528 కోట్లతో ప్రాజెక్టు  తెలంగాణ
    America: ట్రంప్ కీలక ఉత్తర్వులు.. 12 దేశాల పౌరుల రాకపై అమెరికాలో నిషేధం డొనాల్డ్ ట్రంప్
    Census: 2027 మార్చి 1 నుంచి జనగణన ప్రారంభం..: కేంద్రం వెల్లడి భారతదేశం
    #NewsBytesExplainer: కన్నడకు మూలం తమిళమా? కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలపై విశ్లేషణ కమల్ హాసన్

    స్కిల్ డెవలప్ మెంట్ కేసు

    Skill Case : చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టు విచారణ వాయిదా.. మరింత సమయం కోరిన ప్రభుత్వ లాయర్లు హైకోర్టు
    Chandrababu bail: చంద్రబాబుకు భారీ ఊరట.. హైకోర్టులో రెగ్యులర్ బెయిల్ మంజూరు  చంద్రబాబు నాయుడు
    Chandrababu: చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై సుప్రంకోర్టులో విచారణ.. 8వ తేదీకి వాయిదా  చంద్రబాబు నాయుడు
    Chandrababu: సుప్రీంకోర్టులో చంద్రబాబుకు దక్కని ఊరట.. త్రిసభ్య ధర్మాసనానికి క్వాష్‌ పిటిషన్‌ సుప్రీంకోర్టు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025