NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / జల్లికట్టును సమర్థించిన సుప్రీంకోర్టు; కానీ జంతువుల భద్రతను కాపాడాలని రాష్ట్రాలకు ఆదేశాలు
    జల్లికట్టును సమర్థించిన సుప్రీంకోర్టు; కానీ జంతువుల భద్రతను కాపాడాలని రాష్ట్రాలకు ఆదేశాలు
    భారతదేశం

    జల్లికట్టును సమర్థించిన సుప్రీంకోర్టు; కానీ జంతువుల భద్రతను కాపాడాలని రాష్ట్రాలకు ఆదేశాలు

    వ్రాసిన వారు Naveen Stalin
    May 18, 2023 | 12:39 pm 1 నిమి చదవండి
    జల్లికట్టును సమర్థించిన సుప్రీంకోర్టు; కానీ జంతువుల భద్రతను కాపాడాలని రాష్ట్రాలకు ఆదేశాలు
    జల్లికట్టును సమర్థించిన సుప్రీంకోర్టు; కానీ జంతువుల భద్రతను కాపాడాలని రాష్ట్రాలకు ఆదేశాలు

    సంప్రదాయ క్రీడ 'జల్లికట్టు'ను సుప్రీంకోర్టు గురువారం సమర్థించింది. అయితే చట్టం ప్రకారం జంతువుల భద్రత, రక్షణ విషయంలో మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని రాష్ట్రాలను ఆదేశించింది. 'జల్లికట్టు', ఎద్దుల బండ్ల పోటీలను అనుమతించే తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాల చట్టాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై న్యాయమూర్తులు కేఎం జోసెఫ్, అజయ్ రస్తోగి, అనిరుద్ధ బోస్, హృషికేష్ రాయ్, సీటీ రవికుమార్‌లతో కూడిన ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టింది. జంతువులతో కూడిన క్రీడలను అనుమతిస్తూ తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు రూపొందించిన ఇలాంటి చట్టాల చెల్లుబాటును సుప్రీంకోర్టు అనుమతించింది.

    జల్లికట్టును రక్త క్రీడగా పేర్కొనలేం: సుప్రీంకోర్టు 

    సాంస్కృతిక వారసత్వం, పాఠాలు, సాక్ష్యాలను బట్టి ఈ విషయంలో కోర్టు జోక్యం చేసుకోదని సుప్రీంకోర్టు పేర్కొంది. గత కొన్ని శతాబ్దాలుగా జల్లికట్టు కొనసాగుతోందని ధర్మాసనం పేర్కొంది. 'జల్లికట్టు'లో క్రూరత్వం జరిగినప్పటికీ, ఎవరూ ఎటువంటి ఆయుధాలను ఉపయోగించనందున దీనిని రక్త క్రీడగా పేర్కొనలేమని సుప్రీం కోర్టు పేర్కొంది. క్రీడలో క్రూరత్వం ఉన్నప్పటికీ, జంతువును చంపే కార్యక్రమంలో ప్రజలు పాల్గొనడం లేదని ధర్మాసనం చెప్పంది. రాష్ట్రపతి ఆమోదం పొందినందున చట్టంలో కోర్టు జోక్యం చేసుకోదని ధర్మానసం వివరించింది. ఎద్దుల బండ్ల పందేలను అనుమతించే ఇతర రాష్ట్రాల చట్టాల చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    సుప్రీంకోర్టు
    తమిళనాడు
    మహారాష్ట్ర
    కర్ణాటక
    తాజా వార్తలు

    సుప్రీంకోర్టు

    అమరావతి రైతులకు షాక్, 'ఆర్5 జోన్'పై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ అమరావతి
    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి షాక్: జీఓ 1ని కొట్టివేసిన హైకోర్టు ఆంధ్రప్రదేశ్
    ఇమ్రాన్ ఖాన్‌కు సుప్రీంకోర్టు నుంచి ఉపశమనం లభించినా, రాజకీయ భవిష్యత్‌పై నీలినీడలు  పాకిస్థాన్
    ఉద్ధవ్ ఠాక్రే‌కు షాకిచ్చిన సుప్రీంకోర్టు; గవర్నర్ నిర్ణయాన్ని తప్పుబట్టిన ధర్మాసనం ఏకనాథ్ షిండే

    తమిళనాడు

    తమిళనాడు బీజేపీ చీఫ్‌ అన్నామలైపై స్టాలిన్ ప్రభుత్వం పరువు నష్టం కేసు  ఎం.కె. స్టాలిన్
    తమిళనాడు కంబం ద్రాక్షకు జీఐ ట్యాగ్  పండ్లు
    'జడ్జి నాలుక నరికేస్తా'; రాహుల్ గాంధీని దోషిగా తేల్చిడంపై కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు కాంగ్రెస్
    బీజేపీలో చేరిన మరో కాంగ్రెస్ దిగ్గజ నేత వారసుడు బీజేపీ

    మహారాష్ట్ర

    మహారాష్ట్ర: అకోలాలో రెండు వర్గాల మధ్య ఘర్షణ; 144 సెక్షన్ విధింపు తాజా వార్తలు
    మే 1నుంచి షిర్డీ సాయిబాబా ఆలయం మూసివేత; ఎందుకో తెలుసా? షిర్డీ సాయిబాబా
    షిర్డీ సాయిబాబా ఆలయానికి కొత్త సమస్య; గుట్టలుగా పేరుతున్న నాణేలు; స్థలం లేదంటున్న బ్యాంకులు  షిర్డీ సాయిబాబా
    'అవి పుకార్లు మాత్రమే, నిజం కాదు'; బీజేపీలో చేరికపై క్లారిటీ ఇచ్చిన ఎన్‌సీపీ నేత అజిత్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ/ఎన్సీపీ

    కర్ణాటక

    కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ ముఖ్యమంత్రి
    సిద్ధరామయ్యను సీఎం చేసేందుకే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు; మరి శివకుమార్ పరిస్థితి ఏంటి?  ముఖ్యమంత్రి
    కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరు? ఇంకా వీడని ఉత్కంఠ  కాంగ్రెస్
    నా నాయకత్వంలో కాంగ్రెస్‌కు 135 సీట్లు వచ్చాయి: డీకే శివకుమార్ సంచలన కామెంట్స్  కాంగ్రెస్

    తాజా వార్తలు

    వడగాలుల తీవ్రతకు మానవ తప్పిదాలే కారణమంటున్న శాస్త్రవేత్తలు  వాతావరణ మార్పులు
    కేంద్ర న్యాయ మంత్రిగా కిరెణ్ రిజిజు తొలగింపు; అర్జున్ రామ్ మేఘవాల్ నియామకం  అర్జున్ రామ్ మేఘవాల్
    అనారోగ్యంతో బీజేపీ ఎంపీ రత్తన్ లాల్ కటారియా కన్నుమూత హర్యానా
    హైదరాబాద్‌లో డిస్కవరీ గ్రూప్ పెట్టుబడులు; డెవలప్‌మెంట్ సెంటర్‌ ఏర్పాటు హైదరాబాద్
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023