Page Loader
Supreme Court: సుప్రీంకోర్టు యూట్యూబ్‌ ఛానల్‌ హ్యాక్‌..ఛానల్ లో 'క్రిప్టో' ప్రమోషన్‌ వీడియోలు 
సుప్రీంకోర్టు యూట్యూబ్‌ ఛానల్‌ హ్యాక్‌

Supreme Court: సుప్రీంకోర్టు యూట్యూబ్‌ ఛానల్‌ హ్యాక్‌..ఛానల్ లో 'క్రిప్టో' ప్రమోషన్‌ వీడియోలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 20, 2024
12:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలోని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అధికారిక యూట్యూబ్ ఛానల్‌ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. ఈ ఛానల్‌లో క్రిప్టో కరెన్సీని ప్రమోట్ చేస్తున్న వీడియోలను పోస్ట్ చేశారు. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారించే కేసులతో పాటు, కొన్ని కీలకమైన కేసుల విచారణను ఈ ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తుంటారు. ప్రస్తుతం, ఈ ఛానల్‌లో అమెరికాలోని రిపిల్ ల్యాబ్స్‌కు చెందిన క్రిప్టో కరెన్సీ ఎక్స్‌ఆర్పీని ప్రచారం చేస్తున్న వీడియోలు కనిపిస్తున్నాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

బార్ అండ్ బెంచ్ చేసిన ట్వీట్