Surat Fire Accident: సూరత్ కెమికల్ ప్లాంట్‌లో మంటలు.. గాయపడిన 24 మంది కార్మికులు
గుజరాత్‌లోని సూరత్ లో కెమికల్ ప్లాంట్‌లో బుధవారం జరిగిన అగ్ని ప్రమాదంలో 24 మంది కార్మికులు గాయపడ్డారు. PTI నివేదిక ప్రకారం,ప్లాంట్‌లో పేలుడు సంభవించిన తర్వాత మంటలు సంభవించాయి. సూరత్‌లోని సచిన్ జిఐడిసి పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న కెమికల్ ఫ్యాక్టరీలో తెల్లవారుజామున 2 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. ఒక పెద్ద ట్యాంక్‌లో నిల్వ ఉంచిన మండే రసాయనాల లీకేజీ కారణంగా పేలుడు సంభవించిందని సూరత్ ఇన్‌ఛార్జ్ చీఫ్ ఫైర్ ఆఫీసర్ బసంత్ పరీక్ తెలిపారు. 24 మంది కార్మికులు గాయపడ్డారని వారిని చికిత్స నిమ్మితం ఆసుపత్రికి తరలించారని పరీక్ తెలిపారు.
మూడు అంతస్తుల భవనంలో మంటలు
ఘటన జరిగినప్పుడు ఫ్యాక్టరీలో ఎంత మంది కార్మికులు ఉన్నారనే విషయం తెలియరాలేదని పరీక్ తెలిపారు. పేలుడు కారణంగా ఫ్యాక్టరీలోని మూడు అంతస్తుల భవనంలో మంటలు చెలరేగి యూనిట్ మొత్తం చుట్టుముటిందని మరొక అధికారి తెలిపారు. డజనుకు పైగా అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని అధికారి తెలిపారు.