Surat craftsmen : మెరిసే 8 క్యారెట్ల వజ్రంపై ప్రధాని మోదీ చిత్రం.. సూరత్ డైమండ్ బోర్స్ ఆవిష్కరణ
సూరత్ డైమండ్ బోర్స్ భవన సముదాయంలో వున్నSK కంపెనీ ప్రధాని మోదీ చిత్రంతో కూడిన వజ్రాన్ని చెక్కింది. దీని తయారీకి , దాదాపు 20 మంది హస్తకళాకారులు దాదాపు నెల రోజుల్లో తయారు చేశారని మేనేజర్ తెలిపారు. ఈ డైమండ్ మొదట 40 క్యారెట్ల లెబ్రాన్ డైమండ్ అని వివరించారు. అయినప్పటికీ, ఆకారం కోసం కత్తిరించి పాలిష్ చేసిన తర్వాత దాని పరిమాణం ఎనిమిది క్యారెట్‌లకు తగ్గించారు. సూరత్ డైమండ్ బోర్స్ (Surat Diamond Bourse) భవన సముదాయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ డిసెంబర్ 17, ఆదివారం రోజున ప్రారంభించారు.
సూరత్ డైమండ్ బోర్స్ నేపధ్యం ఇదీ
ప్రపంచంలోనే అతిపెద్ద ఆఫీసుల సముదాయంగా ఈ డైమండ్ బోర్స్ నిలిచింది. ఇందులో 65 వేల మంది వ్యాపారాలు చేసుకునేలా ఏర్పాట్లు చేయడం గమనార్హం. వజ్రాలు, వజ్రాభరణాల అంతర్జాతీయ వ్యాపారానికి సూరత్ డైమండ్ బోర్స్ (SDB) కేంద్రంగా నిలవనుంది. అత్యాధునిక హంగులతో ఈ భవనాలను తీర్చిదిద్దారు. ఇవి గుజరాత్‌లోని సూరత్ నగరానికి సమీపంలోని ఖాజోడ్ గ్రామంలో నిర్మాణం చెపట్టారు. శుద్ధి చేసిన, ముడి వజ్రాల వ్యాపారానికి ఈ డైమండ్ బోర్స్ అంతర్జాతీయ కేంద్రంగా మారనుంది. అలాగే ఎగుమతులు, దిగుమతులకు సంబంధించిన కస్టమ్స్ క్లియరెన్స్ హౌస్ కూడా ఇందులోనే ఏర్పాటు చేశారు.