Bengaluru Horror: బెంగళూరు మహిళ హత్య కేసు.. ఒడిశాలోని చెట్టుకు ఉరేసుకున్న నిందితుడు.. సూసైడ్ నోట్ స్వాధీనం
ఈ వార్తాకథనం ఏంటి
దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన బెంగళూరు మహిళ హత్య కేసులో నిందితుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
నగరంలోని ఓ మాల్‌లో పనిచేస్తున్న 26 ఏళ్ల మహలక్ష్మిని, దారుణంగా హత్య చేసిన నిందితుడు ఆమె మృతదేహాన్ని 50 ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్‌లో దాచిపెట్టాడు. తాజాగా అతడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
నిందితుడిని ముఖ్తిరాజన్ రాయ్‌గా గుర్తించారు.ఒడిశా రాష్ట్రం భద్రక్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన నిందితుడు అక్కడ ఓ చెట్టుకు ఉరివేసుకున్నాడు.
స్థానికులు అతడి మృతదేహాన్ని గుర్తించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
మహలక్ష్మిని హత్య చేసిన అనంతరం ఒడిశాకు పారిపోయిన నిందితుడి కోసం కర్ణాటక పోలీసులు అక్కడ నాలుగు బృందాలను పంపించారు.
ఈ నేపథ్యంలో, నిందితుడు పట్టుబడతానన్న భయంతో ఆత్మహత్యకు పాల్పడినట్టు అనుమానిస్తున్నారు.
వివరాలు
టీం హెడ్ గా పనిచేస్తున్న నిందితుడు
మహలక్ష్మి చివరిసారి ఈ నెల 1న డ్యూటీ చేసినట్టు సమాచారం. 2 లేదా 3న నిందితుడు ఆమెను హత్య చేశాడని పోలీసులు భావిస్తున్నారు.
మహలక్ష్మి త్రిపురకు చెందిన వ్యక్తిగా, నిందితుడు ఆమె పనిచేస్తున్న చోట టీం హెడ్‌గా ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు.