తదుపరి వార్తా కథనం
AAP: 'అసెంబ్లీలోకి రానివ్వకుండా మమ్మల్ని అడ్డుకుంటున్నారు'.. ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేల సంచలన ఆరోపణలు
వ్రాసిన వారు
Sirish Praharaju
Feb 27, 2025
12:03 pm
ఈ వార్తాకథనం ఏంటి
దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీజేపీ ప్రభుత్వంపై ప్రతిపక్ష ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) తీవ్ర ఆరోపణలు చేసింది.
తమ ఎమ్మెల్యేలను అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతించకుండా బారికేడ్లు ఏర్పాటు చేసి అడ్డుకుంటున్నారని విమర్శించింది.
ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి, శాసనసభలో ప్రతిపక్ష నేత అతిషి మార్లెనా ఎక్స్ వేదికగా బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
వివరాలు
అసెంబ్లీ చరిత్రలో ఇలాంటి అన్యాయం ఎప్పుడూ చూడలేదు: అతిషి
''బీజేపీ నేతలు అధికారంలోకి వచ్చిన వెంటనే నియంతృత్వ ధోరణికి సంబదించిన అన్ని హద్దులు దాటేశారు. అసెంబ్లీలో 'జై భీమ్' నినాదాలు చేసినందుకు మా పార్టీ ఎమ్మెల్యేలను మూడు రోజుల పాటు సస్పెండ్ చేశారు. ఇప్పుడు అసెంబ్లీ ప్రాంగణంలోకి ప్రవేశించకుండా అడ్డుకుంటున్నారు. ఢిల్లీ అసెంబ్లీ చరిత్రలో ఇలాంటి అన్యాయం, నియంతృత్వం ఎప్పుడూ చూడలేదు,'' అని ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.