Tamannaah Bhatia: తమన్నా భాటియాకు సైబర్ సెల్ సమన్లు.. ఎందుకంటే?
అక్రమ ఐపీఎల్ మ్యాచ్‌ల స్ట్రీమింగ్ కేసులో తమన్నా భాటియా పేరు తెరపైకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించి విచారణ కోసం తమన్నాని మహారాష్ట్ర సైబర్ సెల్ పిలిపించినట్లు వర్గాలు పేర్కొంటున్నాయి. తమన్నాని ఏప్రిల్ 29న విచారణకు హాజరుకావాలని కోరింది. ఈ కేసుకు సంబంధించి సంజయ్ దత్ పేరు కూడా బయటకు వచ్చినట్లు సమాచారం. యాప్‌కు సంబంధించి తమన్నా పేరు రావడంతో, ఈ విషయంలో ఆమె పాత్రపై స్పష్టత కోసం అధికారులు ప్రయత్నిస్తున్నారని నివేదికలు సూచిస్తున్నాయి. డిసెంబరు 2023లో ఈ కేసుకు సంబంధించి ఫెయిర్ ప్లే యాప్‌లోని ఒక ఉద్యోగిని అరెస్టు చేయడంతో దర్యాప్తు గణనీయమైన మలుపు తిరిగింది.