
Tamilnadu Rains: తమిళనాడులో భారీ వర్షాలు.. పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం
ఈ వార్తాకథనం ఏంటి
తమిళనాడును మరోసారి భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి.ప్రధానంగా చెన్నైలో ఆదివారం భారీ వర్షం కురిసింది.దీని కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నాగపట్నం,కిల్వేలూరు తాలూకా,విలుపురం, కడలూరు సహా వివిధ జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు.
అదేవిధంగా కళ్లకురిచ్చి, రాణిపేట, వేలూరు, తిరువణ్ణామలైలోని పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు అధికారులు తెలిపారు.
తమిళనాడులోని వివిధ జిల్లాల్లో వచ్చే ఏడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది.
ఆదివారం కూడా రాష్ట్రంలోని పది జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తున్నట్లు వార్తా సంస్థ ANI నివేదించింది.
Details
ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షం కురిసే అవకాశం
నాగపట్నంలో రాత్రిపూట వర్షం కురిసింది.తమిళనాడులోని చెన్నై,చెంగల్‌పట్టు,కాంచీపురం, మైలాడుతురై,నాగపట్నం,తిరువారూర్, కారైకల్ ప్రాంతంలో మోస్తరు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది.
తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్‌లోని కోస్తా జిల్లాల్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది.
తమిళనాడులో ఈ ఏడాది అనూహ్యమైన వర్షాలు కురిశాయి. అంతకుముందు, మైచాంగ్ తుఫాను వల్ల చెన్నై,చుట్టుపక్కల జిల్లాలకు భారీ వర్షాలతో విధ్వంసానికి గురిఅయ్యాయి.
దీని కారణంగా రాష్ట్రానికి ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు భారీగా నష్టం వాటిల్లింది.
Details
ఆరు జిల్లాలో నేడు స్కూల్స్‌కు సెలవు
మైచాంగ్ తుఫాను అంత తీవ్రంగా ప్రస్తుతం ఉండదని, అయితే తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఆర్‌ఎంసిలోని ఏరియా తుపాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ పి.సెంతమరై కన్నన్ చెప్పారు.
ఈరోజు(సోమవారం) భారీ నుంచి అతి భారీ వర్షం కురుస్తుందని అంచనా వేశారు.
లోతట్టు ప్రాంతాల నివాసితులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
చెంగల్ పట్టు, కన్యకూమారి, తిరవళ్ళూరు సహా ఆరు జిల్లాలో నేడు స్కూల్స్‌కు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.