LOADING...
తమిళనాడులో ఆత్మ‌హ‌త్యలపై స్టాలిన్ కలవరం.. నీట్‌ను ర‌ద్దు చేస్తామన్న సీఎం 
తమిళనాడులో ఆత్మ‌హ‌త్యలపై సీఎం స్టాలిన్ కలవరం

తమిళనాడులో ఆత్మ‌హ‌త్యలపై స్టాలిన్ కలవరం.. నీట్‌ను ర‌ద్దు చేస్తామన్న సీఎం 

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Aug 14, 2023
03:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

తమిళనాడులో విద్యార్థులెవరూ ఆత్యహత్యలకు పాల్పడవద్దని, నీట్‌ పరీక్షను రద్దు చేస్తామని సీఎం ఎంకే స్టాలిన్‌ కోరారు. ఆత్మబలంతో పరీక్షలను ఎదుర్కోవాలని, త్వరలోనే నీట్‌ ను ఎత్తేస్తామన్నారు. చెన్నైకి చెందిన నీట్ అభ్య‌ర్థి జ‌గ‌దీశ్వ‌ర‌న్ శ‌నివారం బలవన్మరణానికి ఒడిగట్టడంపై ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. రెండో సారి పరీక్ష రాసినా ర్యాంక్ రాక‌పోవ‌డంతో ఈ దారుణానికి పాల్పడటం కలవరపెట్టే అంశంగా మారింది.కుమారుడి మరణాన్ని తట్టుకోలేని బాధిత తండ్రి సెల్వ‌శేఖ‌ర్ ఆ మ‌రుస‌టి రోజే ప్రాణాలు తీసుకున్నాడు. నీట్ కు వ్య‌తిరేకంగా యాంటీ నీట్ బిల్లును తీసుకువస్తే దానిపై గ‌వ‌ర్న‌ర్ ఆర్ఎన్ ర‌వి సంతకం చేయట్లేదన్నారు. జగదీశ్వరన్, అతని తండ్రి సెల్వశేఖర్ మరణమే నీట్ త్యాగానికి చివరిదన్నారు.ఈ మేరకు వారి మృతికి ప్రగాఢ సంతాపం తెలిపారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నీట్ మరణాల్లో జగదీశ్వరన్,సెల్వశేఖర్ దే చివరి త్యాగమన్న సీఎం స్టాలిన్